14
సింహగిరి వచనములు
కిరీట విరాజితగాత్రునిగా, కిన్నర కింపురుష గరుడగంధర్వ యక్ష సుర సిద్ధ- అఖిల దేవతా సంసేవ్య పాదపద్మములు గలవానిగా, అనంత గరుడ విష్వక్సేనాది పరిజనపరివృతునిగా భావించి, (కమల?)శేషతల్పునిగాను, శంఖచక్ర గదా ఖడ్గకోదండ పద్మవనమాలికాధరునిగాను, పరబ్రహ్మస్వరూపునిగాను, ఆత్మజ్ఞానమునను శ్రీ అష్టాక్షరీ మంత్రంబుల నిత్యం దండప్రణామంబుల సేయుచుండునతండే పరమభాగవతుండు. అతనికి మీ పరమపదంబే గాని యితరంబులేదని శ్రుతిపురాణములు చాటుచున్నవి. అనాథపతి స్వామీ, సింహగిరి నరహరీ!
5
దేవా! శ్రీమన్నారాయణుండే సకలదేవతలకు, సకలజంతు జీవకోట్లకు జనకుండు. నారాయణ, నారాయణ యని శ్రుతులు పల్కుచున్నవి. గాన తప్పదు. ఇట్లని యెరుగక ఇతరదేవతల గొలిచేనేని వ్యభిచారికొడుకు తండ్రినెరుంగని క్రియను పరమాత్ముని యెరుగక జీవాత్మయే యనేకబ్రహ్మకల్పంబులు జన్మజరామరణాదులం బొందుచునుండును, అనాదిపతి సింహగిరి నరహరిని సర్వకార....మీ దాసులు మిమ్మే కొలుతురు. దయానిధీ!
6
దేవా! దేహంబు మృత్తిక జలంబులచే శుద్ధి చేసెద నంటినా? - మూత్రంబు మలభాండము. చిత్తశుద్ధి చేసెదనంటినా, విషయేంద్రియము లుండవు. దేహంబును, చిత్తంబును మా సింహగిరి నరహరిందలంచినగాని పవిత్రము గాదె, దేవా!
7
దేవా! శ్రీమన్నారాయణ కథామృతము. పరమపదంబునకు సోపానముక్తి నెదర్పడి నడిపించెడిది. ఇదియే సత్యము. మనసా! నీ వనుమాన