పుట:Sinhagiri-Vachanamulu.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

13


3

దేవా! హరిశ్రీమన్నారాయణ, పరబ్రహ్మస్వరూపా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా, దేవా! తాటకి ప్రాణాపహారా, విశ్వామిత్ర యజ్ఞకర్తా, యజ్ఞభోక్తా, యజ్ఞస్వరూపా, సర్వం విష్ణుమయం జగ(త్తనుశ్రుతి నికరపరివేష్టితా), విలువిద్యా(దీక్షాగురూ), మారీచమృగ వేటకాడా, మహామాయా వినోదా, ఖరదూషణత్రిశిరఃఖండనా, అతికాయమహాకాయ కుంభ నికుంభ కుంభకర్ణ వజ్రదంష్ట్ర వజ్రకవచ మహోదర మహాపార్శ్వ కోలాహలాపహార, ఇంద్రజిత్తు తలగుండుగండా, రావణగిరి వజ్రాయుధా, సకల దేవతా మోక్షరక్షకా, విభీషణ ప్రతిష్ఠాపనాచార్యా, శ్రీ మద్ద్వారకాపురినిలయా, గోవర్ధన గిరిధరా, గోపీజన మనోవల్లభా, వేణునాదవినోదా, పారిజాతాపహారా, శిశుపాల శిరశ్ఛేదనా, కాళింగమర్దనా, కౌస్తుభాభరణా, శ్రీవత్సలాంఛిత కుచకుంకుమపంకిలా, యశోదానందనా, మధురానాయకా, మహామునిగణసేవితా, వాల్మీకి ప్రయోగసన్నుతా, ఓ గజేంద్రవరదా, ఓ ప్రహ్లాదవరదా, ఓ యక్రూరవరదా, ఓ యంబరీషవరదా, ఆపద్బాంధవా, ద్రౌపద్యభిమానరక్షకా, పాండవపక్ష ప్రతిపక్షపాలకా, విదురునింటివిందా, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సనకసనందన సనత్కుమారాది యోగీంద్ర బృందారక వంద్యా, ఆదిమధ్యాంతరహితా, అధోక్షజా, క్షీరాబ్ధిశయనా, వటపత్రశయనా, వారిజనాభా, భక్తి ముక్తి ప్రయోగ సన్నుతా, శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరినరహరీ!

4

దేవా! మీ చరణారవింద సేవకు నే కులజుండైన మిమ్ము హృదయకమలకర్ణికా(ర)మధ్యమందు పరబ్రహ్మంబుగా భావించి రత్నసింహాసనాసీనునిగా చేసి పురుషసూక్తప్రకారమువలన ఆవాహనాసనార్ఘ్యపాద్యాచమనస్నాన వస్త్రయజ్ఞోపవీత గంధ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల నీరాజన ప్రదక్షిణ నమస్కారము (మొద)లైన షోడశోపచారంబుల నర్చించి, కంకణ కేయూర కౌస్తుభాభరణ మకరకుండల హార మణిమయ