పుట:Sinhagiri-Vachanamulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

సింహగిరి వచనములు

లు సేయంగానేమి, అయిదుకోట్ల కన్యాదానంబులు సేయంగానేమి, నాలుగు కోట్ల వస్త్రదానంబులు సేయంగా నేమి, మూడుకోట్ల సత్యాది వ్రతంబులు నడుపంగా నేమి, రెండుకోట్ల అన్నదానంబులు సేయంగానేమి. కోటి స్నానంబులు సేయంగానేమి.

దేవా, మీనామోచ్చారణంబు సేయక పదికోట్ల యజ్ఞాదిక్రతువులు నడిపిన దేవేంద్రుండు నిలువల్లాయోనులయ్యెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక తొమ్మిదికోట్ల తులాభారంబులు తూగిన దుర్యోధనుండు యమ పురికేగెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక యెనిమిదికోట్ల సువర్ణదానంబులు చేసిన కర్ణుడు పసిమి కొండమీది అన్నంబులకు అపేక్షించెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక యేడు కోట్ల గోదానంబులు సేసిన కార్తవీర్యుండు గోహత్య బ్రహ్మహత్య పాతకములు బొందెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక ఆరుకోట్ల భూదానంబులు చేసిన బలుండు(బలి?) విష్ణుపాదంబున పాతాళంబున కేగెను. దేవా, మీనామోచ్చారణంబు సేయగ అయిదుకోట్ల కన్యాదానంబులు చేసిన ధ్రువుండు కాశీక్షేత్రంబున పండ్రెండువేల యేండ్లు భిక్షం బెత్తెను. దేవా, మీనామోచ్చారణ సేయక నాలుగుకోట్ల వస్త్రదానంబు సేసిన మార్కండేయుండు మతిహీనుండయ్యెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక మూడుకోట్ల సత్యాదివ్రతంబులు నడపిన వా.......రివుండు (హరిశ్చంద్రుండు?) కులహీనునియింట కాడుగాంచెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక రెండుకోట్లన్నదానంబులు సేసిన ధర్మజుండు యమపురి తొంగిచూచెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక కోటిస్నానంబులు సేసిన కుమారస్వామి కోరిక సిద్ధించదాయెను. దేవా, మీనామోచ్చారణంబు సేసిన ప్రహ్లాద, నారద, పుండరీక, వ్యాస, శుక, శౌనక, భీష్మ, దాల్ఖ్య, రుక్మాంగద, అర్జున, బలి, విభీషణ, భృగు, (గాంగేయ?), అక్రూర, విదురాదులును పరమభాగవతోత్తములు (నారాయణస్మరణ వలన) కృతార్ధులైరి గావున యతి రామానుజముని వరం దాతారు. అనాది(థ)పతియైన స్వామి సింహగిరి నరహరి, నమో నమో దయానిధీ.