Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

9

పురి పట్టణము, రావణ కుంభకర్ణాదుల వధించుట, విభీషణునికి పట్టము గట్టుట.7. కృష్ణావతారమునకు వసుదేవుడు తండ్రి, రేవతి తల్లి, గాంగేయ(గార్గేయ?) మహర్షి గురువు, ద్వారకపట్టణము, నరకాసురుని వధించుట, నూటపదియారువేల గోపికాస్రీల సంభోగము జేయుట, 8. బుద్ధావతారమునకు అమృతజీవుండు తండ్రి, మాతంగావతి తల్లి. ఆకాశధృవుండు గురువు, త్రిపురాపురి పట్టణము, అంధకా దారకాసురుల వధించుట, స్త్రీల వ్రతమాన భంగము సేయుట. కలికావతారమునకు హిందావతి తండ్రి, హేమావతి తల్లి, అయోధనుండు గురువు, జంబావతిపట్టణము, భస్మాసురుని వధించుట, శంకరుని అభిమానము రక్ష సేయుట (10), (కృతయు)గ త్రేతాయుగ, ద్వాపరయుగంబుల, కలియుగంబుల బుట్టుచు, చేసిన దోషంబులు, స్త్రీహత్యలు, బ్రహ్మహత్యలు, భ్రూణహత్యలు, సహోదరగమనంబున మాతృగమనంబున, సురాపానంబున, బ్రాహ్మణోత్తముండు చండాలయోనియందు ఇంద్రియాదులు విడచిన దోషంబులు, తొలంగునె దేవా! ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్ఫ్య, రుక్మాంగదార్జున, వశిష్ట, బలి, విభీషణ, భృగు, గాంగేయ, అక్రూర, విదురాదులును పరమభాగవతోత్తములు నారాయణస్మరణ వలన కృతార్థులైరి. కాన ఏడురామాయణంబులు, పదునెనిమిది పురాణంబులు, ద్వాదశస్కంధములు, భగవద్గీతలు, సహస్రనామంబులు మొదలైనవి చదివిరేమి, వినిరేమి, వ్రాసిరేమి సంకీర్తనకు వెయ్యిపాలింటికి సరిరావు. కడమసంకీర్తనలు అనేకులు (అనేకములు?) వినినారు. ఇందుకు తప్పరాదు. మీచరణ(పాద)పద్మంబులాన.[1] యతిరామానుజముని వరందాతారు. స్వామీ సింహగిరినరహరీ, నమోనమో దయానిధే.

4

దేవా! పదికోట్లయజ్ఞాదిక్రతువులు నడపంగా నేమి? తొమ్మిదికోట్లు తులాభారంబులు తూగంగానేమి, యెనిమిదికోట్ల సువర్ణదానంబులు సేయంగా నేమి, యేడుకోట్ల గోదానంబులు సేయంగానేమి, ఆరుకోట్ల భూదానంబు

  1. కలికావతారమునకు ....'అనునది లిఖిత ప్రతిలో ఇచట కలదు.