పుట:Sinhagiri-Vachanamulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

సింహగిరి వచనములు

మని చింతించుచున్న సమయంబున వైశ్వానరుండును అగ్నిభట్టారకుండు ఎదురుగా జనుదెంచి ఆ భాగవతోత్తముకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి అనేకకాలమునాటి బాంధవులు వేంచేసిరని(న) దివ్యవిమానారూఢులంజేసి యా నిప్పులయేరు ఈవలికి వెడలించెను. ఆ నిప్పులయేరు ఆవలికి వెడలి మరియు అనేకలక్షల యోజనంబులు చనుచుండగా ముందట నొక వృక్షంబు గలదు. ఆ వటవృక్షంబు ఇరువది తొమ్మిది లక్షల యోజనముల విస్తారమును,ఎనిమిది లక్షలయోజనంబుల పొడవుంగల (వటవృక్షంబుగల) దు. ఆవటవృక్షంబు క్రించ చతుర్భుజావతారులైనహరిదాసులు అనంతకోట్లు వేంచేసియుందురు. ఆవటవృక్షంబునకు ప్రదక్షిణాకారంబు (ప్రదక్షిణ నమస్కారంబు?) చేసి ఆవట వృక్షంబు తూర్పుభాగంబున విరజానది గలదు. ఆ శ్రీ విరజానది మున్నూటముప్పది మూడులక్షల యోజనంబులు విస్తారమును దశలక్షల యోజనముల పొడవును గల శ్రీవిరజానదితరియించెడిది యేది యుపాయమో దైవమా యని చింతించుచున్న సమయంబున భూలోకంబున తాజేయు ధర్మపరోపకార భగవద్బాగవతకైంకర్య(ములు), శ్రీయేకాదశి, శ్రీరామనవమి, శ్రీకృష్ణజయంతి మొదలైన(వి); అన్నదాన, గోదాన, భూదాన, హిరణ్యదాన, వస్త్రదాన, హిరణ్యగర్భరత్నదానాదులు మొదలైన మహాపుణ్యమార్గంబులన్నియుం గూడి యొకనావయై వర్తింపుచుండును. హరిపదధ్యాన, పురాణశ్రవణ, నక్షత్రహరిదర్శనంబనియెడు, ఆత్మజ్ఞానంబనియెడు పరమాత్మ పిపీలికాండై అ(ఆ?) ధర్మనావ చనుదెంచును. ఆనావయెక్కి చరమజ్ఞానంబనియెడి వాయువేగ మనోవేగంబున ఆశ్రీవిరజానదికిదరిని తీర్థంబొనరించిన ఆ శ్రీ విరజానదిని ఆతిరుమేను వైచి, పసిడి తిరుమేను ఎత్తి, నిలువంబడియున్నంత శ్రీవిరజానది ఆవలిదరి వెంట అరువదికోట్ల హరిదాసులు ఎదురుగా వేంచేసిరి. ఆ భాగవతోత్తములను గాఢాలింగనంబు చేసిన మేనునిమిరి, అనేకకాలమునాడు బంధువులు వేంచేసిరని మహావైభవంబుతోడను శ్రీవిరజానది దరివెంట మరియు అనేకలక్షల యోజనంబుల పొడవుంగల అశ్వత్థనారాయణుండు గలడు. ఆయశ్వత్ధమునకు ప్రదక్షిణాకారముచేసి, అక్కడకు లక్షయోజనంబులు చనుచుండగా ముందర దివ్యపదంబై న పరమపదంబు గానుపించెను. ఆపరమపదము మున్నూట