సింహగిరి వచనములు
టముప్పది లక్షల యోజనంబులు, పితృలోకంబునకు సత్యలోకంబు సహస్ర లక్షలు గడచి, సత్యలోకంబునకు సర్వేశ్వరుండున్న సన్నిధానంబునకు సహస్ర కోట్లు గడచి, యిటువంటి పరమ పదమునకు అనేక లక్ష యోజనంబులు చనుచుండంగాను, ముందరనొక తిల వృక్షంబు గలదు. ఆ తిల వృక్షంబు నలువది నాల్గు లక్షల యోజనంబుల పొడవును గల (తిల వృక్షంబు గల)దు. ఆ తిలవృక్షంబు తన మోక్షాపేక్షితులై త్రియంబక వాసు(మ?) దేవాదులు త్రింశత్కోట్లు గాచుక యుందురు. ఆ తిల వృక్షము ప్రదక్షిణముచేసి మరియు అనేక లక్షయోజనంబు(లు) చనుచుండగాను ఆముందర మద్ది వృక్షంబు గలదు. (ఆ మద్ది వృక్షంబు) అరువది యెనిమిది లక్షల యోజనములు విస్తారమును ముప్పది లక్షల యోజనముల పొడవునుంగల మద్దివృక్షంబు క్రింద భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకంబులనియెడు మీదేడు లోకంబులును; అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకంబులనియెడు క్రిందేడు భువనంబులును (మీదేడు భువనంబులును) గూడుకొని, యొక బ్రహ్మాండంబనిపించును. ఇట్టి బ్రహ్మాండంబులు అనంతకోట్లు. ఆమద్ది వృక్షంబు క్రిందను మోక్షాపేక్షితులై తపంబొనర్చెడి మహాత్ములంబొడగని ఆ మద్ది వృక్షంబునకు ప్రదక్షిణంబుచేసి, మద్దిగడచి యనేక లక్షయోజనంబులు చనుచుండగాను, ముందరనొక అంధకారమైన నది కలదు. అంధకారమైన నదిని తీర్ధమాడెను. అక్కడనుండి అహంకార మమకార షడాకార (అరిషడ్వర్గ?) షడోన్మయ (షడూర్మిమయ?) శ్రీలింగ(?) ఈషణత్రయ, మఖత్రయ, అవస్థాత్రయ, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక సుఖదుఃఖ సముద్రములు గూడి వర్తించెడి మాయా పురుషుండు మరిచి చనుదెంచి మహ త్తనియెడి లోకంబు ప్రవేశించి యుండును. అంధకారమైన నదిగడచి మరియు ననేక లక్షల యోజనంబులు గడచి చనుచుండగాను ముందరనొక నిప్పులయేరు గలదు. ఆ నిప్పులయేరు సమీపమునకుంజని కృతాంజలియై యిమ్మహావైతరణి తరియింప నేదియుపాయ