పుట:Sinhagiri-Vachanamulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

సింహగిరి వచనములు


2

దేవా, మీ యవతార వినోదంబులు సహస్రంబులు. పంచశతకోటి భూమండలంబు జంతురాసులయందు జనియించి సన్యాసి శిరోమణి యైన సిరికృష్ణువలన మిమ్ము నెరింగితిని. నా కర్మంబులు విసర్జించితిని. దేవా, భూలోకంబునగల యవస్థలన్నియు జూచి నిర్దయాధికారినై పరమరహస్య పురాణేతిహాసాగమ మంత్రాక్షరంబులు పరివేష్టించి చూచిన మీదివ్యనామ సంకీర్తన గతిగాని మరి యితరంబులేదు. చాతుర్లక్ష గ్రంధ సంకీర్తన నామోచ్చారణంబులు పరిపూర్ణంబైన నాకు పరమపదంబు ప్రసాదించు మనిన, అట్టే కానిమ్మని యా సర్వేశ్వరుండు శంఖ చక్ర గదాధరుండై ప్రత్యక్షంబై వైకుంఠంబు సహస్రద్వారంబులు మీ దాసానుదాసులైన పరమభాగవతులకు వైకుంఠంబు ప్రసాదింపుము. ఇందు ఒక వాకిట పుణ్యతీర్థసారంబైన దేవసమూహంబులు శతసహస్రయుతసంఖ్యలు కాచుక యుందురు, ఒక వాకిట తిరుపల్లాండు మెదలైన యాళ్వారులు, హరిదాసులు అరువది వేలు లక్షలు గాచుకయుండురు. ఒక వాకిట గోవింద తొండరులు తొంబదిలక్షలు గాచుకయుందురు. ఒక వాకిట మణి మాధవులు మూడు లక్షలు గాచుకయుండురు. దేవా, ఒక వాకిట జయమణి విజయాదులు డెబ్బది లక్షసంఖ్యలు మిగిలి వేత్రదండహస్తధరులై సేవింప, ఒక వాకిట కుముదకుముదాక్షులు శతసహస్రంబులు గాచుక యుందురు. ఒక వాకిట ఋగ్వేదంబును, ఒక వాకిట యజుర్వేదంబును, ఒక వాకిట సామవేదంబును, ఇంకొక వాకిట అధర్వణవేదంబును, ఒకవాకిట నానాగమపురాణేతిహాస మంత్రాక్షరంబులును, ఒక వాకిట ఉపనిషద్వాక్యంబులును, ఇవ్విధంబున తమ తమ నిజాకారంబు గైకొని ఒక్కొక్క ద్వారంబున కోటి సంఖ్యలు గాచుకయుందురు. ఇటువంటి పరమ పదమునకు జనియెడి మార్గంబు - భూలోకంబుననుండి చరమదేహంబు దిగనాడించి నిర్మలంబైన దివ్యదేహంబు ధరియింపంబడి భూలోకంబునకు సూర్యమండలంబు లక్షయోజనంబులు గడచి, తారామండలంబునకు, ధృవమండలంబు డెబ్బది మూడు లక్షల యోజనంబులు గడచి, ధృవమండలంబునకు పితృలోకంబు మున్నూ