సింహగిరి వచనములు
51
57
దేవా, నేను చిన్ననాడు చేసిన యఘాయిత్యము జెప్పుచున్నాఁడను. దేవా, ఒక కోమటి పిన్నవాఁడును, నేనును కోటి కోడిపుంజుల జూదమాడగాను నా కోమటిపిన్నవాఁడు తొంబదిలక్షల పైకాలకు పందెమొడ్డెను. నేనును, మీ తళియప్రసాదములపై పందెమొడ్డితిని (!) ఇట్లు నా కోమటి పిన్నవాని కోడియు, నా కోడి యు నేవిధమున యుద్ధము చేయుచున్నవి. దేవా, “ఘటితముఖవరదధిత సంధిత కౌస్తుభాంశు .... మకుట కఠోరవందిత కుంభినీజయ శోభితమ్! కనకఘనపీతాంబరాచ్యుత కౌస్తుభాజయశోభితమ్
గీతడోలక ఆదిజం! కిణికిణింకిణి! కిణికిణింకిణి! కిణికిణింకిణి! కణికిణింకిణి! దేవా, అనాథపతీ స్వామీ, సింహగిరి నరహరీ, ఈ గీతమువిధంబున యుద్ధము సేయుచుండగాను, నా కోమటిచిన్నవానికోడి తన్నెను. నా కోడి మృతమాయెను. కోమటి చిన్నవాఁడు తనకోడి గెల్చెనటంచు తిరువీథులను పౌరుషంబులాడగాను నేను కామక్రోధలోభమోహమదమాత్సర్యంబుల తొంటి మదోన్మత్తుండనై యా కోమటిచిన్నవాని తిరుకుచ్చుపట్టి[1] మాఱితిని. (?) ఆ కోమటి చిన్నవాఁడు మృతుండాయెను. దేవా, వాని ప్రాణవాయువులు వాని కిచ్చెదవా యియ్యవా యనిన నతని ప్రాణవాయువు లీయకున్నను జూచి, దేవా, మీరు శబరి ఎంగిలి తిన్నది చెప్పుదునా, యతని ప్రాణవాయువు లిచ్చెదవా యియ్యవా యనిన నతని ప్రాణవాయువు లీయకున్నను జూచి, దేవా, మీ రంధకాసుర తాటకాసుర విదళితాసుర ధేనుకాసుర సోమకాసుర కంసాసుర (వధల) లోపల నపశబ్దంబులు భాషించినవి చెప్పుదునా, యితని ప్రాణవాయువు లిచ్చెదవా యీయవా యనిన నతని ప్రాణవాయువులీయకున్నంజూచి, 'నీకు చాతుర్లక్షగ్రంథసంకీర్తన కాయను మాతల్లి కడవాడవా? నీవు మా కెన్నాళ్ళ ఋణస్థుండవో! నీకు నే నెన్నాళ్ళ ఋణస్థుండనో!' యటంచు మీకు విన్నపము చేసిన నాకోమటి పిన్నవాఁడు దిగ్గనలేచి కూర్చుండి యందెలు మువ్వలు మ్రోయగాను తన
- ↑ పరిమాఱితిని (?)