పుట:Sinhagiri-Vachanamulu.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

హరిజనులను మొదట “మనసారా' ఆదరించి భగవత్ సేవావకాకాన్ని ప్రసాదించటం.

వర్ణవ్యస్థకు అతీతంగా, వివిధ వర్ణాలకు చెందిన ' ఆళ్వారులకు 'అతిమానవ 'కాదు. “దివ్యత్వ "ప్రతిపత్తి కల్పించి ఆలయాలలో వారికి 'పూజాపురస్కారాలు' పరికల్పించి (అట్లాంటి 'దివ్యసూరులు' వేంచేయని ఆలయాన్ని దివ్వస్థలంగా పరిగణించక, ఆచట తీర్ధప్రసాదాలు స్వీకరించరు శిష్టులు నేటికీ. అట్లాంటివాటికి 'ప్రాకృత' స్థలాలనే వ్యవహారం) తీర్థ ప్రసాద స్వీకార యోగ్యత సర్వులకూ సంతరించటం.

మానవులంతా హృదయం ఉంటేచాలు. సౌదర్యసంభావనం చేయగల వారైతే చాలు లింగ, వర్ణ విభేదంతో ప్రమేయం లేకుండా భారతీయ ఆధ్యాత్మిక సంపదనుభవానికి వారసులని చెప్పటం, ఇట్లాంటి సంస్కరణ లెన్నో వారి సమతాదర్శనానికి, సౌందర్యభావనానికి తార్కాణలుగా నేటికీ నిలుస్తాయి. దీని పర్యవసానమే ఇటు మన కృష్ణమాచార్యులవారు అటు తాళ్ళవాకవారూ శ్రుతి సమ్మితాలుగా, బహు శ్రుతి సమ్మరాలుగా, బహుశ్రుత మఠాలుగా తెలుగు నాట తెలుగులో, వేదాలు పాడటం.

శ్రీమద్రామానుజులు - కళింగాంద్రం

ఇట్లాంటి వక్తి త్వమూ అంతరంగమూకల శ్రీమద్రామానుజులు ఆసేతుశీతాచలమూ పర్యటించి తమ సిద్ధాంతం ప్రచారం చేస్తున్న సమయంలో అన్ని ప్రాంతాలతోపాటు ఆంధ్రావనీ అయన ఆశయాలను ఆదరంతో స్వీకరించింది. ఎందరో పూర్వభాగవత వైష్ణవ కుటుంబాల వారూ అద్వైతాదీతర మతాల వారు కూడాఆయన సిద్ధాంత ప్రతిపాదనల్ని శిరసావహించి నూతనోత్తేజంతో శ్రీవైష్ణవులై నారు. ఆయన ఆంధ్రదేశ పర్యటనలో శ్రీకూర్మ సింహాచలాలు విశిష్ట ఘట్టాలు. కళింగాంధ్రం అంతా ఆయనకు కైమోడ్పులు ఘటించింది. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమద్రామానుజుల నిర్యాణానికి సరిగ్గా వంద సంవత్సరాలనాడు మన ప్రథమాంధ్రవచన కవితాచార్యులు కృష్ణమాచార్యులు అవతరించేరు. పై పూర్వరంగపీఠికలో నిరూపింపబిడ్డ శ్రీమద్రామానుజుల వ్యక్తిమూ, ఆశయాలూ కృష్ణమాచార్యులు గా తెలుగు