Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

సింహగిరి వచనములు

నీవు వెలి'యని మామామ వెలివెట్టి నన్ను తిరుమాళిగనుండి వెళ్ళం ద్రోచెను. దేవా! మిమ్ము నెవ్వండు నమ్మును? దేవా, ఓం నమో నారాయణాయ, తిరుకల్యాణము విఘ్నముచేయవలసి వేంచేసినారుగాన మిమ్మెవ్వండు నమ్మును? ఓం నమోనారాయణాయ. ఆచార్యులే గతి నిన్ను మేమొల్లమనిన విని, 'ఓయీ, కృష్ణమాచార్యా, నీకింత ప్రలాపంబేమిటికి? మానుమనిన నట్టిదే కానిమ్మని ఓం నమోనారాయణాయ యంటిని. ఆ రాతిరి (మీరు) శ్రీ రంగాచార్యుల స్వప్నమందుబోయి, కృష్ణమాచార్యులయింతిని యాయన తిరుమాళిగకు వెంటఁబెట్టుకొనివచ్చి దిగవిడువుమన్న మాటకు (నాతఁడు) దండము సమర్పించెను. శ్రీ రంగాచార్యులు తమ తిరుమాళిగకు వేంచెసిరి. ఇదియే నా విన్నపము. ఓం నమోనారాయణాయ. ప్రహ్లాదవరదా, మీకన్న నధికులు లేరు. నాకన్న నధములు లేరు. నాయింతిని నాకు నంపించితిరి. వెలియన్న మాటకు దండము సమర్పింపజేసితిరి. మీకగపడి యున్నాఁడను. నాకంత మెన్నడు! విషయాటవిలోఁ బడి, వెడలెడు త్రోవఁగానక చిక్కియున్నాఁడను. సంకీర్తనమిది. (ఇందు) పరమ రహస్యమున్నది. ఇందు ఋగ్వేద మున్నది. యతిరామానుజముని వరము, దాతారు, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

56

దేవా, విప్రగోవధ లనేకంబు లొనర్చి సురాపానసువర్ణఘాతుకాది మహాపాతకంబులు చేసినయతండైనఁగాని, యేకనిమిషంబున మీ దివ్యనామసంకీర్తన చేసినతండే నారాయణశ్రేష్ఠుండు కాకుండునా? ఇతరులు మెచ్చవలెనని మనస్సు వేఱోక్కచో నిలిపి మిమ్ము నుతిచేసెనేని జారిణిని పతివ్రతయని నమ్మవచ్చునా? అట్లేయిట్టివారు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!