Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

49

వేంచేసెదనోయి కృష్ణమాచార్య'యని యానతిచ్చిన 'ఓం నమోనారాయణాయ, మీరేల వేంచేసెదరు! ప్రహ్లాదవరదా,' యటంచు మీకు విన్నపము సేసిన 'నట్లు గాదోయి, కృష్ణమాచార్యా, నీవు పదునొకండవ యవతారుండవు. లీలావినోదముతో నీ తిరుకల్యాణము చూడ వేడుకయ్యెను. నేనును వేంచేసెదను.' అని యానతిచ్చిన 'నట్లే కానిండు. ఓం నమో నారాయణాయ. ఇది మీరెఱుంగుదురో యెఱుంగరో, మిమ్మెవ్వండు నమ్మవచ్చునా? ఓం నమోనారాయణాయ. జగన్నాటక సూత్రధారివి గావా! సుగ్రీవుని చేపట్టి వాలిని మర్దించిన వాఁడపు గావా! మిమ్మెవ్వండు నమ్మునే? నమోనారాయణాయ. మిమ్మునమ్మరాదు,' అనిన, 'రావోయీ, నేవచ్చెదను, లక్షి తిరుకల్యాణమునాడు సురాసుర యుద్ధమాయెను. వేదశాస్త్రఘోషంబై యుండెను. రుక్మిణి తిరుకళ్యాణమునకు శిశుపాల యుద్ధమయ్యెను. ఏతిరుకల్యాణమునకు వేడుక చాలదాయెను. నీ తిరుకల్యాణము చూడవచ్చెదనోయీ, కృష్ణమాచార్యా'. ఆ క్షీరసాగరమధ్యమందున్న వైనతేయుని నీ విధమున స్తోత్రము సేసితిని. “భద్రబదంతే జవ్వలతో దృపాఅపస్సమాః! మద్యమకేశవా ఓం హవాం! పాత తపోమధ్యానాత! అఖిలాండజారజాం" ఆక్షీరసాగరమధ్యమందున్న వైనతేయుండు పనివినియెను. దేవా, వైనతేయునెక్కి మీరును వేంచేసితిరి. దేవా, మామామ శ్రీరంగాచార్యులు నాతిరుకల్యాణ మేవిధమునఁ జేయుచున్నాఁడు విన నవధరింపుము. కృష్ణార్పణముగా దానములు గావించెను. వైష్ణవులకు మధుపర్కములు సమర్పించెను. నాయింతికి నాకును నిష్ణాన్నమును భుజింపఁజేయునప్పుడు మీరు వేంచేసి, 'యిదియేమి? కృష్ణమాచార్యా, మీరే భుజించుచున్నారు? నేను మహాయలపై యున్నాఁడను. తళియవడ్డించవోయి, కృష్ణమాచార్యా'. యని యానతిచ్చిన మీకును తళియ వచ్చెను. (మీరును) నేనును భుజియింపంగాను నచ్చటికి శ్రీరంగాచార్యులు వేంచేసి, 'యదేమి కృష్ణమాచార్యా, ఇతడు చరముండై యున్నాడు. మీకును యజ్ఞోపవీతములులేవు. ఇతఁడు వైష్ణవుడని తళియవడ్డించితివి. వైష్ణవులకు మధుపర్కము లిప్పించితివి. శూద్రునకు నిష్టాన్నమును భుజింపఁబెట్టితివి.