పుట:Sinhagiri-Vachanamulu.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

48

సింహగిరి వచనములు

యద్భుతంబని నన్ను దిగిచి మఠములోఁబెట్టి, యీ బాలుండు పురుషాకారము గలవాఁడు. ఇతని నేవిధమున నైనను బోషింపవలయునని తలంచి కొన్ని వర్షంబులు పెంచి, యంతట సంతూరు విడిచి సింహాద్రి స్వామి సన్నిధికిఁ జనునప్పుడు నన్ను మఱవకుమని పలికిన కువ్వా రప్పుడు స్వామిసన్నిధికిఁ జనెను. త్రిరాత్రంబులు శిశువు చూచి సింహగిరీశుండైనస్వామి తనమీద దయదప్పెనోయని యున్న సమయంబున, బాలరూపంబున వచ్చినస్వామి క్షీరంబులు దెచ్చి యుపయోగింపుమనినఁ బుచ్చుకొని లోపలికేగి హస్తముల నయనములు దుడుచుకొన్న సమయంబున నంధత్వముమాసె. (అతడా)శ్చర్యపడి నిద్రించు సమయంబున స్వామి తన స్వప్నంబున వరాహరూపంబునఁ బ్రత్యక్షంబై , నాసన్నిధిని సంకీర్తన నామోచ్చరణంబులు, నుపనిషద్వాక్యంబులును, పరమ(భక్తి భరిత)చాతుర్లక్షగ్రంథసంకీర్తనములు చెప్పుమనెను. 'నేనెక్కడ? నామోచ్చారణం బెక్కడ? జదుండను, మూడుండను. అనిన స్వామి యుపదేశము జేసిరి. తాను పురోహితుని గృహంబునకుం జని తనకు సంకీర్తననామోచ్చారణం బుచ్చరింప ముహూర్తము బెట్టుమనిన విప్రుడు హాస్యముచేసె. స్వామి తన వాక్యములు నిలుపుకొని వికృతిసంవత్సరంబున జన్మంబును(బొందుటయు), పరాభవ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు చిటితాళంబులను బూని సంకీర్తన చేయుచుండగాను, నంతట కువ్వా రేతెంచి, యాశ్చర్యపడెను 'మీ సందర్శనంబున, గృతార్థుండనైతి' ననిన కువ్వారు 'నామోచ్చారణంబు సత్యంబు'ననగా, నన్నేలినస్వామి నన్ను రక్షించుగాక. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

55

దేవా, (యమునా) గోదావరి యావల శ్వేతద్వీపమందు మా మేనమామ శ్రీరంగాచార్యులు గలరు. వారి (కుమార్తె) యందు తిరుకల్యాణము గాబోవుచున్నాఁడను. ఇది మీకు విన్నపము సేయుచున్నాఁడను తిరుకల్యాణమునకు పనివినవే దేవా, యని మీరు విన్నపము సేసిన 'నేను