పుట:Sinhagiri-Vachanamulu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

47

ప్రయోజనాంతరంబులం గోరెడువాఁడు ద్విజుండుగాడు. శ్రుతి ప్రమాణము చాటించుచున్నది. అటుగాన, ననాథపతిస్వామీ, సింహగిరి నరహరీ, మిమ్ము నెఱుంగని ద్విజున కేది గతి? ఎఱింగింపవే దేవా, ప్రాణము లిహమునఁ జరియింపుచు, దేహాత్మ డెందముల వసియించి, భుజియించి [నవనిపూత] భువనపాలనరక్షకుం డయిన పురుషోత్తముని కృపకు దూరమగుటఁగాన నిహమున కర్హుండుగాడు. మాంసభక్షకులే రాక్షసులు. అటుగాన హింస చేయరాదు. ఇందుకు సాక్షి యేద న్నాయన మా సింహగిరి నరహరి సకలాంతర్యామి యగుట, సకలభూతాత్మకుం డగుట, సకలపరిపూర్ణుం డగుట, సకలజీవదయాపరుం డగుట, సత్యమే సాక్షి. అనాధపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

53

దేవా, మమపురుషాం దేవా, దయాపదా, పరమధర్మనికరా, దుఃఖవిమోచనా, మంగాళాకారా, దోషనిర్హరణా, వినవద్యా, నిరవధికా, నిత్యనిరంజనా, నిర్వికల్పా, నిరాలంబా, నిరాశ్రయా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

54

దేవా, సద్విజుండు చండాలసతివలన సంగతిఁబడసి నటువలెను, ద్వమైకనిష్టుండు ప్రసన్నురాలిగాని భార్య నేలందలంచిన, యట్టివారెల్ల ననాథపతీ,స్వామీ, సింహగిరి నరహారీ, పరో.... ........రు.[1] కాన సింహగిరి దేవా, పరమపదనివాసుని దయను, భూలోకంబునఁ బుట్టవలసి సంతూరను జనియించి, (దుష్ట)నక్షత్రమున వ్యతీపాతయోగంబున జనియించియుండెనని, తన్ను రోసి తన జననీజనకు లంధకారంబైన కూపములో వైచిన, రోదనము చేయుచుండగాను, నొకసన్యాసిశిరోమణియైన కువ్వా రేతెంచి

  1. కొద్ది గ్రంథపాతము.