పుట:Sinhagiri-Vachanamulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

సింహగిరి వచనములు


50

దేవా, గరుడని చేతఁబడియున్న భుజంగముక్రియను, కర్మముల నగపడియున్నాఁడను. నిరంతరము దుర్విషయాటవిలోఁబడి వెలువడుత్రోవంగానక చిక్కియున్నాడను. దేవా, సుజ్ఞానంబను, తెలివినిఁబొందక (యున్న) యీ దుష్టునకు నజ్ఞానంబను నడవిని ఛేదించి పరమ జ్ఞాన మార్గము కరుణించవే. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

51

దేవా, ఎనుబదినాలుగులక్షల జీవరాసుల యోని ముఖములందు జనియించిన యాదిజీవుండవట! ఆమీద మీగుణకథనము తెలిసికొనుట, నా మీదట నాచార్యుల కృపఁజేరుట, నాసుదర్శన పాంచజన్యంబులు ధరించుట, నా శ్వేతమృత్తికాచూర్ణ ధారణంబగుట, నావిరజానదిందాటఁజింతఁజేయుట, నా చరమార్థంబనియెడు తెప్పఁగట్టి యాద్వయమనవతరంబు సంధించుచు, నంబుజావతారుండగుట, నామీద నిజపుర ప్రవేశంబగుట, మీ సందర్శనంబు గలుగుట, మీరును తానైక్యంబగుట, నాయనంతకోటి సూర్యప్రకాశముతో ప్రజ్వరిల్లెడు (మూర్తి దొరకుట) నిట్టిఫలంబు లొకటొకటియై తోచెడుదేవా, అఖిలాత్మకర్తవై, సింహగిరిపతివై, యనేకజన్మార్జితమైన పాపిని కరుణించవే, పరమమందెన్నడు దొరకునో మీచరణారవింద మకరందము! దీనబాంధవా, సింహగిరి నరహరీ, నన్నవలోకింపు దయానిధీ!

52

దేవా, దేహయాత్రకు మిగిలిన యర్థసమర్పణ ముఖ్యముగాదు. తన్నుడిగిచేయు సమర్పణం బుత్తమాధికారంబు. అనాథపతి సింహగిరీ(నరహరీ)శుండటుగొని అవలోకింపఁడు దేవా, జగదీశ్వరుండితఁడేయని నిగమములెల్లను నాయనంతకోటి సూర్యప్రకాశముతో (బ్ర)జ్వరిల్లెడు (మిమ్ము గుఱించి) చెప్పగా నెఱుంగక, దేవతాంతర మంత్రాంతర సాధనాంతర