పుట:Sinhagiri-Vachanamulu.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

41

జామదగ్నిరామ దశరథరామ రామకృష్ణ బుద్ధ కల్క్యవతారా, కార్త్యవీర్యసహస్రబాహుఖండనా, విలువిద్యా విక్రమ ప్రియానుగ్రహణోత్తరణా, గంగాప్రవాహోద్బాధిత [1]లోకజాతశ్రేష్ఠా, జ్వరాకరాళ వైశ్రవణ తదీయ రచితార్థరాక్షస ప్రళయాంతకా, హేమసుచరిత్రాసమేతా, సకల (ల?) రక్షణ సంపూర్ణా, హలాయుధధరా, దేవకీవసుదేవప్రియాత్మజా, యశోదా నందవర్ధనా, కుక్కుటాసుర భస్మాసుర శకటాసుర ధేనుకాసుర ప్రలంబాసుర గర్వమదదర్వీకరా, బలభద్రానుజా, బృందావన లీలావినోదాబ్ధి రామాభిరామా, సకలాంధకారమార్తాండా, (రుక్మిణీ ) మనోవల్లభా! సత్యభామా మనస్సరోవర రాజహంసా, జాంబవతీముఖ సంపూర్ణచంద్ర చంద్రికాచకోరా, మిత్రవిందా ప్రమేయా, భద్రాప్రాణనాయకా, సుదంతీమనోరంజకా. కాళిందీకందర్ప స్వరూపా, లక్షణాసకల కళాప్రమేయా, షోడశసహస్ర (గోప)స్త్రీ హృదయానుకూలా, అనాదిబ్రహ్మచారీ, పాండవపక్షపాతీ, గాంధారీ పుత్రమిత్రదవానలా, సకలసన్నుతా, ఆపదుద్ధారకా. శ్రీకృష్ణా, శరణాగత వజ్రపంజరా, దివిజబ్రహ్మాదివంద్యా, ఉగ్రనఖత్రిపుర భేతాళా, కరినిర్వాపణా, దుష్టనిగ్రహా, శిష్టప్రతిపాలకా, ధర్మరక్షకా, అశ్వపురఘట్టన నిపుణా, అనంతావతార లీలావినోదా, శంఖచక్రగదాశార్ఙ కోదండ సకలాయుధప్రచండా, పద్మవనమాలికాధరా, వేదవేదాంతవేద్యా, కుసుమిత మకరతోరణాలంకారా, శ్రీపుండరీకాక్షా, శ్రీనృసింహమూర్తీ, శ్రీసహస్రనామా, శ్రీయనంతనామప్రసన్నా, శ్రీమద్భగవాన్, శ్రీనివాస, సర్వేశ్వర, శ్రీలక్ష్మీసమేత, శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

42

దేవా, జయజయ, పరమపురుషా, పరమపదనివాసా, పరంధామా, పరతత్త్వప్రకాశా, అచలాచలా, అనుపమా, ఆదిపురుషా, అపరంపరా,

  1. హాచ్చాదిత?