పుట:Sinhagiri-Vachanamulu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

సింహగిరి వచనములు

లయంబులై యిన్నిటిలోపల వెలుగొందు. ఓ సింహగిరి నరహరీ, తేజోమహితమై మీమహిమలిట్లు బ్రహ్మాండములై పరగుచు నాదిమబ్రహ్మమై రంజిల్లు. పరబ్రహ్మమై శోభిల్లు, తారక బ్రహ్మమై వర్ధిల్లు, ఇదినిర్గుణమై పరమాత్మమున నణగు. ఇది సగుణమై విరాట్పురుషరూపంబుతో నుండు. ఇది గుణసంయుక్తమై త్రిమూర్త్యాత్మకము దానగు. అట్టి నారాయణమూర్తియై యఖిలాత్మ తానగు. అట్టియనంత వేదాగమముల కునికి. ఇట్టి యపవర్గ మోక్షమునకు ముముక్షుముక్తి. కైలాస వైకుంఠ బ్రహ్మలోక గీర్వాణములు మా సింహగిరి నరహరి యిచ్ఛా విహారములు. స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

40

దేవా, నిత్యపదంబైన మీ దివ్యనామ సంకీర్తనఁ బఠియింపనేరక (సర్వదేవతలు సాక్షియైన) భర్తను విడచి పరపురుషుంగోరు వ్యభిచారిణి విధంబున నున్నవాఁడను. నన్ను గృతార్థుఁజేయవే! అనాథపతీ స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

41

దేవా, స్వస్తి, సమస్తలోక నిస్తారకా, శ్రీపురాణ పురుషోత్తమా, శ్రీలక్ష్మీకుచ కుంకుమాంకిత వక్షఃస్థలా, గాంభీర్యధైర్యా, సనకసనందన సనత్కుమార కపిల నారద మునీంద్రవందితా, విభీషణ ప్రహ్లాదార్జునాంబరీషప్రియా, రుక్మాంగద గజేంద్ర సేవాలాలితా, భృగుభరద్వాజ మాండవ్య మార్కండేయ గౌతమ శౌనకాదిముని గణసేవితా, శ్రుతిప్రియపూజితా, బ్రహ్మాదిసురముని హృదయస్థితా, త్రిమూర్త్యాత్మకా, నైరృతవరుణ వాయుకుబేరేశానాది దిక్పాలేశ్వరా, లక్ష్మీనారాయణా, యమునోత్పల లోకసాకారా, బింబాసమ నవరత్నఖచిత పాంచజన్య భవ్యజ్వాలాభిరామా, బాలార్కమణి గణాంకితసందర్శన గరుడధ్వజా, అనంతశయనా, క్షీరాబ్ధిశయనా, అనేక దైత్యనిర్జిత దోర్దండా, మత్స్యకమఠ వరాహ నారసింహమూర్తివామన