పుట:Sinhagiri-Vachanamulu.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

39

యంబు లుదయించు. పంచేంద్రియంబుల కాలయంబై సప్త[1] హితవుల నివాసంబై విషయాతుర మమతలఁ దగిలి జీవుండు సకలాశాబంధకరుండై యుండు గావున పుత్రేషణ దారేషణ ధనేషణం బనియెడు మాయయాత్మ తిరుమంత్రాపేక్షలను, నరిషడ్వర్గంబులను జేజిక్కించుకొని బడలెడు జీవున కెక్కడికులము? తనువుచే మనము, మనముచే ధనము, ధనముచే గనకము; ఇట్లు జనులకు దమోగుణం బుదయించుఁగాన ననుదినము మీ పదధ్యానమునం దగిలి యుండఁదగును. మీ మాయ నిర్మలోదకంబునఁ బ్రతిబింబంబు గానవచ్చిన క్రియ మనంబునఁ గానవచ్చును. దేవా, ఘనతరంబగు నాచార్యకరుణావిశేషంబువలన నష్టాక్షరి మంత్రోపదేశము చేసినను సూర్యప్రకాశంబుచేతఁ జీకటిబాసినక్రియ నాసంసారార్జవము గడచితిని. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

38

దేవా, ఇక నేనేమి చేయుదు? దైవమా, నా పూర్వకర్మంబులన్నియుం గూడుకొని సతులై , సుతులై, సహోదరులై, బంధువులై, హితశత్రువులై, యనేకతెఱంగుల నన్ను బెనఁగొని పోనీయక వేపుచున్నవి. నే నేమి చేయుదునో దైవమా? కామములై, క్రోధములై, లోభములై, మోహములై, మదములై, మాత్సర్యములై, చలములై, విద్యావిడంబంబులై, త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులై, యనేకతెఱుంగుల నన్ను బోనీయక వేపుచున్నవి. దైవమా, ఇట్టి నాదుష్కర్మంబులన్నియుం బెడఁబాపి, మీ దాసానుదాసునింగాఁ జేసి రక్షింపవే. అఖిలజగన్నాథా, అఖిలజగదానందమూర్తీ, జగజ్జీవనా, జగన్నివాసా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

39

దేవా, ఘనత్రిమూర్తులాదిగా నీవిశ్వ మజాండము లోపలిది. ఈరీతి ననంతములైన బ్రహ్మాండకటాహములే నీ మేనియణువులు. ఇవియే దిగ్వ

  1. ధాతువుల