పుట:Sinhagiri-Vachanamulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

సింహగిరి వచనములు


36

దేవా, (ఏక)శిలానగరంబనియెడు నొకపట్టణమందు నగసాల పరమసేవ్యుం డుత్తముండు. (అతఁడు జీవయాత్ర)ను సమాప్తంబు సేసె. అంతట నాతని ప్రియపత్నియైన సతి శవంబునకు విమానంబు గావించి, చిత్రవిస్తారముగా శృంగారములు తన ప్రాణవిభుని దేహంబున నొనరించి కనకమయప్రాకారపట్టణమధ్యవీథియందు[1] సమాధి కెక్కించుకొని, సమాధిక్రియలకుఁ బోయెడు కామిని, శ్రీకృష్ణమాచార్యులఁ గనుగొని సాష్టాంగదండప్రణామంబు సేయఁగాను. నంత నేను 'దీర్ఘాయుష్మంతు రాలవై యుండు'మని యాశీర్వాదము సేసితిని. ఆయింతి 'నాకెక్కడి దీర్ఘాయుష్యము? ఓ మహాత్మా! నాపతి కైలాసమున కేఁగెను. నేను సమాధికిఁ బోవుచున్న దానను.' అనిన నేను మహాశ్చర్యమంది, మీ దాసుని వాక్యము వృధాపోవచ్చునా యని. 'ఓన్నమోనారాయణా, శ్రీమన్నారాయణా, యని దండెయుఁ జిటితాళంబుల ఘుమఘుమధ్వనులతో మీ దివ్యనామసంకీర్తన చేయగాను, గొంతతడవునకు శవమునకుఁ బ్రాణము వచ్చి దిగ్గన లేచి శ్రీ కృష్ణమాచార్యులకు దండము పెట్టి, యోమహాత్మా, మీ మాహాత్మ్యంబునను కైలాసవాసుఁడు (కరుణించె). నీ నిమిత్తంబున శ్రీకృష్ణమాచార్యులు. వైకుంఠపతినిఁ దారుచున్నాడు. నీవు శతవర్షంబులు లోకమందు భోగభాగ్యము లనుభవించుమని యానతిచ్చి శివకింకరులచేత మఱల ద్రోయించగా వచ్చితినని విన్నవించెను. శ్రీకృష్ణమాచార్యులు కరుణించిన కరుణాకటాక్షవీక్షణంబుల నో దేవా, యీజీవిని రక్షింపఁజేసితిరి. మీ మహత్వంబు నుతింప నేనెంతవాఁడను? ఆశ్రితరక్షకుండవు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

37

దేవా, అన్నమయంబుల వలనఁ ద్రిగుణాత్మకంబైన పంచేంద్రి

  1. "కనకమయిపట్టణప్రాకారగగనమధ్యవీథియందు" అని కలదు.