సింహగిరి వచనములు
37
నుత్తరవిహారమున కుతూహలుఁడై ఋష్యశృంగుని సేవించి యతనిచే సకలపుణ్యంబులు విన బోయి"[1] శ్రీవత్సమహాఋషీశ్వరుండును, భృగుండును (?) నగు (నాతనికి) నేత్రమున తారకు(నకు) దండప్రణామంబు సేసి మునీశ్వరునితో, 'భృగు వెవ్వఁడు? ఆది మూలం బేది? అతఁడు దేనికొఱకు భూలోక భువర్లోక సువర్లోక (ంబులదిరిగె?) కైలాసవాసుని నేల శపించె? బ్రహ్మ నేల శపించె [2].......... వాసుదేవుని శరీరంబున కెరిగిన శిశుపాల దంతవక్త్రుల......[3] స్వామి నిజమంటపంబున కేగి దేవదేవుని భావించి పరిపరిగుణంబుల సేవించి, సకలలోకవృత్తాంతంబును విన్నవించి, జగద్భరితుని నామామృతరసమును సేవించినవాఁడై, యాత్మసంతోషంబున వారిమీద పాదంబులు చాచిమఱచి నిద్రించిన, పాదంబున నమరిన నయనపంక్తిసహస్రముల (హరి) నీరుగావించె. భృగుఁడు నిద్రమేల్కొని నివ్వెరగంది, చిక్కితినని, శ్రీకాంతుని శరణుజొచ్చినఁగాని పనులు తీరవని తెలిసి యాదేవు పాదపద్మంబుల కొరిగి, భీరుండై 'పరమాత్మా, నిన్ను బాధించి తన్నితి. లోపమూలంబని నానేర మెంచకు. నన్ను గృపఁజూడు. నీబంటునైన నేను నీచమతులైన మునులకెల్ల నాత్మలోపల మూలంబు నీవని మీచరిత్రము జెప్పి, కన్నులఁ గప్పిన కర్మపాశము లూడను స్తోత్రంబు లుర్విం జేసెద. అచ్యుతానంతుని దివ్య శ్రీపాదపద్మంబుల నమరిన తీర్థప్రసాదంబుల భువిధారుల కెల్లఁబుణ్యంబుల నీయ దనుపు(ము). అమరేంద్రవంద్యా, అని యాదిమూ ర్తిచే నలరిన వేడ్కలెల్ల సమకూడ నానంద మంది, జిహ్వశుచిగా శ్రీ జగన్నాథుని పాదతీర్థములఁగాని పాపములు వీడరావని మునులకెల్ల నెఱిఁగించి పుణ్యులంజేసె, ఇదియుత్తర[4] ... యతి రామానుజా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!