36
సింహగిరి వచనములు
వికార దూషణరహిత హృదయాభిమాన పరుండు దాఁ గాక, కీటకాంకుర జన్మంబున హతుండు దాఁ గాక? భాగవతాపచారంబును దాఁ బొందక అనాథపతి, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!
35
దేవా, శ్రీరామమంత్రోచ్చారణంబున వాల్మీకి పురాణపురుషోత్తము డైన యాదినారాయణమూర్తి దివ్య శ్రీపాదపద్మంబులంజూచి యపేక్షించి నప్పుడే రామమంత్ర రహస్యమునఁ గృతార్థుండయ్యె. అదిగాక శ్రీ జగద్భరితుండైన దేవుం డొకండేయని వ్యాసులు[1] "సత్యం సత్యాత్మకమ్ దైవమ్! సత్యవాక్య దృఢవ్రతమ్౹ సత్యం సత్యంపున స్పత్య ముద్దృత్య భజ ముచ్యతే౹ వేదశాస్త్రాత్పరం నాస్తి నదైవం కేశవా త్పరమ్౹౹ "అనిన శ్రుతి వలన భాష్యకారులు విజ్ఞానులు. అత్యంతవిభవమున పరాశరపుత్రుండు చాటిన లక్షణములు బ్రహ్మంబని వశిష్టుడు తాత్పర్యంబునఁ బరగె. దూర్వాసుండు మాధవ శ్రీధరములను, వామదేవుండు హృషీ కేశమును, బ్రహ్మ రుద్రాదులు సంకర్షణ గోవింద మంత్రములను, విశ్వామిత్రుండు పురాణపురుషోత్తమమును, శ్రీకశ్యపాదులు దామోదరమును, శాండిల్యుఁడు శ్రీనాభమును, గౌతముం డనిరుద్ధత్రితయమును, నారదుండు శ్రీనారాయణమంత్రమును, పుండరీక కణ్వాదులు త్రివిక్రమమును, మాండవ్యుఁడు జనార్దనమును, నాత్రేయుండు శ్రీకృష్ణమంత్రమును, సనకసనందనసనత్సుజాతులు వామనమంత్రమును, జమదగ్ని శ్రీరామమంత్రమును, శుక్రుండు శ్రీనారసింహమును, బృహస్పతి నమోనారాయణమును (నుపాసించిరి.) వీరు మొదలైన పుణ్యులు సహస్రనామంబులను, మఱియును మహాత్ము లనంతంబులు గూడి యనంతవేదములనియెడు వేదవేద్యుం డనంతంబులం బ్రబలియుండునని యనంతకోటిరవిప్రకాశంబైన దేవుని యనంతనామంబులఁ గొనియాడిరి. వాల్మీకిఋషిపుంగవుండు భరద్వాజున కెఱింగించె. నీవు నృసింహమంత్రంబు పఠించి పరమపుణ్యుండవైతి వనెను. భరద్వాజుండును
- ↑ ఇచట "దక్షాధ్వరం బెక్కి" అని కలదు. కాని యర్థము పొసగదు.