సింహగిరి వచనములు
35
వరవాసుదేవా, నిర్మలస్వరూపా, పరమపురుషా, పరంతపా, పరంధామా, పరబ్రహ్మా, అను మీనామంబులుగల యష్టోత్తరశతనామంబులు శ్రియఃపతి ముఖ్యనామంబులు. కేశవా, నారాయణ, మాధవా, గోవిందా, విష్ణూ, వాసుదేవా, అనిరుద్ధా, సంకర్షణా, హృషీకేశా, విశ్వంభరా, వైకుంఠవాసా, వేదాంగా, వామనా, అహల్యశాపవిమోచనా, చక్రధరా, జనార్దనా, పరంధామా, వేదాత్మకా, కపిరాజా, యజ్ఞపురుషా, అను మొదలుగాఁగల నామంబులు శ్రీ కేశవుని యుపనామంబులు. శ్రీకృష్ణా, త్రివిక్రమా, పుండరీకాక్షా, ఉపేంద్రా, నారసింహా, పీతాంబరా, శార్ఙ్గధరా, శౌరీ, దైత్యారీ, వనమాలీ, విష్వక్సేనా, మధుసూదనా, తీర్థనాథా, శేషశయనా, అంభోనిధీ, వేదోద్ధారా, యజ్ఞవరాహా, ఆదికూర్మా, లంకేశ్వరా, హంసనయనా, సప్తాంగా, అను మీ యిరువదియొక్క నామంబులు మొదలుగాఁగల క్రియానామంబు లనంతములు. ‘అకారార్థో విష్ణు’ వనెను. ‘వేదాక్షరం శివయంతి’ యనెను, ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ యనెను. ఆ శ్రుతివలన ఇతిహాసపురాణరహస్యములు చెప్పిరి. అకారాది సర్వవర్ణముల కర్థములు (మీ) నామములే. రాజస తామస దైవములకుఁ గలిగెనేని, యర్థాంతర రూపవర్ణము లంతర్యామి ప్రతిపాదకములు. ఇతరదేవతలయందు వేదార్థములుగావు. అది యెట్లన్న శంఖంబింద్రజితేంద్రచంద్ర కౌమండూక రూపములందున్నను నర్థములు వేరైనట్లు, ‘బ్రహ్మ[1] విష్ణు మయం జగత్.’ శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ. [2]
34
దేవా, ద్వయమున కధికారి యెంతటివాఁడు? కోపము, శాంతము, నిర్లజ్జయు నింద్రియజయపరుండు గావలెఁగాక ద్వయాధికారి తన్ను దానెఱుంగక దూషించు కపటాచార డాంబికపరుండు ద్వయాధికారియగునె?