పుట:Sinhagiri-Vachanamulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

సింహగిరి వచనములు

మాడించఁగాను మీ నాట్యవినోదమున నుదయించెను. ఆ పరమపదనివాసుఁడు వేంచేయఁబోలును. భగవానుని మీవలన నీవిధముగాఁ గంటిని. భాగవతకృపఁ గానము. భగవానునికృప గానము. మీరు మా పరమాచార్యులై యన్నియుఁ దెలిపితిరి. తెరలెత్తుఁడు స్వాములారా", యని కృష్ణమాచార్యులు దండము సమర్పించెను. అప్పుడు పొతకమూరి వైష్ణవులు గడుసంతుష్టిఁ బొంది యుప్పొంగి కృష్ణమాచార్యులం గొనియాడిరి. ఓ మహాత్మా, నీవు దక్క దైవములేదు. నీవే కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగములకు కృష్ణావతారుండవై జనియించినాఁడవు. నీవు మహాత్ముండ వగుదువు. మీ మాహాత్మ్యమును మేము గనుగొంటిమి. మీయనుజ్ఞవలన శ్రీపాదతీర్థ తళియప్రసాదములను బ్రసాదించుఁడని యా యాచార్యుని తిరువడిగళ్ళకు నొరగి యంగుష్టప్రమాణంబు పట్టుకొని దండప్రణామంబు సమర్పించిరి. “మీ శ్రీపాదతీర్థమును, తళియప్రసాదమును మా జన్మవిమోచనముగా భుజించితిమి. అడియేలకు నె ట్లానతిచ్చెదరు? మగుడ శ్రీ యహోబలమునకు పనివినవలెను. అంపకమవధరించుఁ'డని యాచార్యులకు విన్నపము సేసిరి. అప్పుడు కృష్ణమాచార్యులు వైష్ణవులతో, " వో మహాత్ములారా! చాతుర్లక్షగ్రంథసంకీర్తనలకు కొదువ లక్షయేబదివేలు విన్నపము సేయవలెను. ఆనాటికి మీ సేవ దొరకునో దొరకదో యని చింతించగాను, నీసమయమందు మీరు వేంచేసితిరి. మీ సేవకలిగెను, గనుక నెవ్వరికి వెరవను. యమునకు వెరవను, కొదవ గాకుండను చాతుర్లక్షగ్రంథసంకీర్తన వాక్పూజలు మీవలన మీభండారమునకు (?) విన్నపము సేతును. మా పితృపితామహులు ప్రపితామహులు నరకమునుం గొంత గాంచిరి, మీ(వంటి) దయాళులవలననే నరకహేతువు వీడ్కొని సాయుజ్యమును బొందిరి. మీద్వారముల సన్నిధిని యధికారము నాకుఁ (గలదు.) అదే నిత్యనివాసముగాను మఱి మఱవకుండను పరమపదము కృపసేయుఁడు, పరమపదమునకు సాలోక్య సామీప్య సాయుజ్యములు మాకుండును.ఆంతరంగ బాహ్యరంగములకు మీయనుజ్ఞ ప్రసాదించుఁడు. నూటయెనిమిది తిరుపతులును మీ లీలావినోదములు. ఇఁకమీదట మీ తిరునాళ్ళను మీతిరుమేనను