పుట:Sinhagiri-Vachanamulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

31

దింతురు గాని, మీ శ్రీపాదతీర్థము, తళియ ప్రసాదము నడియనికిఁ గృప సేతురుగాని, శీఘ్రమే వేంచేయుఁ"డని పొతకమూరి వైష్ణవుల వెంటఁబెట్టుకొని తిరుమాళిగకు వేంచేసి బాహ్యరంగమునఁ బటము గట్టించి, పటము చాటున ఫొతకమూరి భాగవతులను బంతిగట్టుఁడని, యంతరంగమునకు వేంచేసిరి. అంతరంగమునఁ బటముపన్నించి, పటముచాటున సింహాద్రి జగదీశ్వరుని తిరువారాధన, యారగింపుతళియ నిడి, భగవానుఁ డారగించినమీదటఁ బొతకమూరి భాగవతులకు తళియప్రసాదమును శ్రీపాదతీర్థమును (నిచ్చి) “స్వాములారా, యడియని కైంకర్యమును గైకొనుఁడని," కృష్ణమాచార్యులు పొతకమూరి భాగవతులకు దండము సమర్పించెను. పొతకమూరి భాగవతులు లేచి, కృష్ణమాచార్యుల కినుమడి ముమ్మడిగా దండములు సమర్పించిరి. తిరుగ బంతిగట్టిరి. తిరువాయిముడి చదివిరి. అష్టాక్షరి నుచ్చరించిరి. ద్వయమును బఠించిరి. తిరుమంత్రమును విన్నపము సేసిరి. కృష్ణమాచార్యులు కృపచేసిన శ్రీపాదతీర్థ తలియప్రసాదము లడియేలకు మహాప్రసాదమాయెనని తెరలెత్తి తమకించిరి. అంతట బాలుని సందేహము కలిగి తమలోఁ దాము తెరలెత్తక నిలుమనిరి. అప్పుడు కృష్ణమాచార్యుల చేరంబిలిచి, “యో మహాత్మా! సింహాద్రినాధుని ద్వారసన్నిధిని మీరు సంకీర్తనపూజ లానతీయు సమయమున మీ శిశువు తిరుమాళిగయొద్ద నుండి యాడుచును బాడుచును మీదరికి శీఘ్రమే వేంచేసి మీ తొడలమీద నెక్కి కూర్చుండెను. ఆబాలుని సల్లాపంబుల సద్దు తిరుమాళిగలో వినరాదు. అతఁ డెచ్చటికి వేంచేసినాఁడు?అతని నిచ్చటికి వేంచేయుమనుడు. అతని శ్రీపాదములకు దండము సమర్పించవలయునని యపేక్షించియున్నారమ" ని కృష్ణమాచార్యులంగూడి విన్నపము చేసిరి. అప్పుడు కృష్ణమాచార్యులు పొతకమూరి భాగవతుల సందేహమును దెలిసి “యాతండు మా శిశువు కాఁదు. మీ శిశువుం డని యుంటిమి. అడియనికి నటువంటి యధికారము లేదు. అడియనికి మీరు శిశువును గృప సేసి యేడవవర్షంబు వెడలు సమయమందే మీ సాయుజ్యమున కీడేర్చుకొంటిరి. ఆ బాలునికిని మాకును బనిలేదు, మీ రహోబలేశుని పటముచాటునఁ దాండవ