Jump to content

పుట:Shrungara-Savithri-1928.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేవు. నడుమఁగూడ నోక చోఁ గొంత గ్రంథపాతమున్నది. ఈ గ్రంథమును ముగియరచింపక పూర్వమే గ్రంథకర్త స్వర్గస్ధుండై యుండునని యూహము. ఆప్రతినిబట్టి తత్కర్తను గుర్తింపఁగుదురడయ్యెను. కాని శ్రీ రఘునాథరాయ మహాకవి రచియించిన రామాయణమందలి పద్యములు (ఋష్యళ్ళఁగ తపో భంగము పట్టుననున్నవి.) ఈ గ్రంగమునందును కుండుటచే తత్కర్తయే యేత్కర్త యగునని మే మూహించితిమి.

రామాయణము, వాల్మీకి చరిత్రము, మొదలగు రఘునాథ రాయల కృతుల రచనములకును, ఏతత్కృతి వచనములకును చాల పోలికగలదు. మహాభారతారణ్య పర్వమున మార్కండే యముని ధర్మరాజునకుఁ జెప్పినట్టుగా ఈ సావిత్రీ చరిత్ర కథయున్నది. ఈ ప్రబంధమునను గూడ న ట్లేగలదు. రఘునాథ రాయఁడు రామాయణమును రచియించినట్లే భారతమును గూడఁ దెలుఁగున వేఱొక పద్యకావ్యముగ రచింపఁబూనె నేమో? ఇది దానిలోని యొక కథపట్టు ఆగునేమో?

కవితా విశేషము.

ఇందు సందర్భితములయిన రాజాస్థానమర్యాదలు, హాస్య ప్రసంగములు, వేశ్యావినోదములు, సంభోగ శృంగారములు రఘునాధరాయలనాఁటి తంజావూరి సౌభాగ్యములను, గవితా