Jump to content

పుట:Shrungara-Savithri-1928.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భావించిరి. ఆయన చరిత్రమునుఁ గొందఱు కవులు సంస్కత కావ్యములుగా, నాంద్ర ప్రబంధ ములుగా, నాటకముగా, యక్షగానములుగా, ద్విపదలుగా, పాటలుగా, నింక నేన్నేని తీరులుగా వర్ణించియు, వర్ణింపఁ జాల మైతిమని పగచిరి. ఒక మహావిద్వాంసుఁడు తా నాయనశిష్యుఁడనని చెప్పుకొనియెను. ఒక మహావిద్వాంసుఁ డాయన పేర నాఱుప్రబంధములు రచియించెను. ఇతరు లాయన పేరని పై స్నేని కృతులు రచించుట కాదు. ఆయనయు నా నేకకృతులు రచియించెను. రామాయణము, వాల్మీకిచరిత్రము, పారిజాతాపహరణము మొదలైనవి తెల్గునను, రామాయణసంగ్రహము, సంగీతనున మొదలయినవి సంస్కృతమునను నామహాకవి రచించిన కృతులు. ఆయన రచించిన రామాయణమును మధురవాణియను వేశ్య సంస్కృతమునఁ బరిపర్తించెను. రెండుజాములలో పారిజాతాపహరణ ప్రబంధము నామహాకవి రచించినఁట.

సావిత్రీ చరిత్ర

రసవంతమగు నీ ప్రబంధమునుఁ గూడ 'నామహారాజ కవియే రచించియుండు నని మే మనుకొనుచున్నాను. దీని మూలము తంజావూరి సరస్వతీ పుస్తకశాలలో నున్నది. అది ప్రాతపుస్తకము, గ్రంథారంభ మొక యాశ్వాసము లేనట్లున్నది. ఆశ్వాసాద్య పద్యములు, ఆశ్వాసాంత్య పద్యములు