Jump to content

పుట:Shrungara-Savithri-1928.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌకుమార్యములను, ఆస్థానసంప్రదాయములను, వెల్లడించు చున్నవి.

తేట తేట కూర్పులు, భావవైశద్యములు, సరపపద సంధానములు ఈగ్రంధమునకుఁ బ్రశస్తిని గూర్చుచున్నవి. దూరాన్వయముగాని, క్లిష్టపద రచనగాని యిందుఁ గానరాదు. నాఁటి యభిరుచుల కనుగుణముగాఁగాఁబోలును శాంతరసమున కెక్కువగా సంభావనము కల్గవలసిన యేతత్కథా ప్రబంధమునఁగూడ, శృంగారరసమునకే సంభానన చాలగా దొరకెను. హాస్య రచన యిందు మిక్కిలి యానందింపఁ దగినంతవింతగా సంతరింపఁబడినది. రాధా మాధవమువలె నీకృతియు రవికరంజక పై వెలయఁ గలదని నమ్ముచున్నాము. ఇందు లోపించిన యాశ్వాసాద్యాంత్యపద్యములు కథాభాగములు ఇంకా నెక్కడనేని దొరకఁ గల్గుననునాళ మాకులేదు. తంజావూరిలోనే లేకపోగా నిక నెక్కడ దొరకును? అట్లు దొరకు భాగ్యమే కల్గునేని పునర్ముద్రణమున పూరించి సరిపఱుతుము.

దీని మూలప్రతిని తంజావూర్ పుస్తకళాలనుండి బ్రహ్మశ్రీ మానవెల్లి రామకృష్ణకవిగారు స్వహస్తముతో వ్రాసి తెచ్చుకొని యుండిరి. మా ప్రార్థనలమీఁద వారు దానిని, బ్రకటించుటకు దయచేసిరి. వారి తోడ్పాటుచేతనే యనాయాసముగ దీనిని మే మిపుడు ముద్రింపఁగల్గితిమి. ఇట్టి యుత్కృష్ట