పుట:Shriiranga-mahattvamu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    మకరకుంభములకు మార్తాండసూనుఁడు
    పతి త్రివేదమూర్తి భాస్కరుండు
    కర్త సింహమునకుఁ గర్కటరాశికి
    నఖిలలోకవంద్యుఁ డమృతకరుఁడు. 76

వ. అని యివ్విధంబున, 77

మ. గణవర్ణాదుల మేలుఁ గీడు వెలయంగాఁ జెప్పె సాహిత్యల
    క్షణదీక్షాగురుఁడైన గౌరనసుధీసత్పుత్రుఁ డత్యుల్లస
    ద్గుణరత్నాభరణుండు [1]భైరవకవీంద్రుం డెందుఁ దద్జ్ఞుల్ దనుం
    బ్రణుతింపం గవిరాడ్గజాంకుశము భూప్రఖ్యాతమై మించఁగన్. 78

{ఇంతవరకు పరిషత్ వారు పైన పేర్కొనిన పత్రికలో ముద్రించిరి, మధ్య మధ్య పద్యములలోని అసమగ్ర భాగాలు (... ఈ గుర్తులు) పత్రిక యందే గలవు, మరియు 78 పద్యానికి ఫుట్ నోట్సు కూడా - వారుంచినదే)

కవి గజాంకుశమున లేనివని రెండు పద్యములను చాగంటి శేషయ్యగారు
ఆంధ్ర కవితరంగిణియందు (1980 ముద్రణ 5 భాగము 244 పుటలో) ప్రకటించిరి - ఆ పద్యము లివి,

క. పతి మృతుఁ డగుఁ బద్యాదిని
    మృతనక్షత్రంబు లిడిన మేదురసౌఖ్యా
    న్వితుఁ డగు నమృతము వలన న
    ప్రతిమములగు తారకములఁ బద్యాది నిడన్.

సీ. అవనిగణాలి గణావలి కధిదేవ
    తలును వన్నెలు గ్రహంబులును వాని

  1. రత్నపరీక్షను, శ్రీరంగమాహాత్మ్యమును రచించినకవి, ప్రతికి మూలము మానవల్లి రామకృష్ణకవిగా రిచ్చినది. (పత్రిక. 121 పుట)