పుట:Shriiranga-mahattvamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

భాషా పరిణామాన్ని, సాహితీవికాసాన్ని, సాంఘికేతిహాసాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకోవడానికి ప్రాచీనార్వాచీన సారస్వతాన్ని అధ్యయనపరులందరికీ అనువైన పద్ధతిలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రాచీనాంధ్ర కావ్యాలను ముద్రించి సరసమైన ధరలకు లభించే అవకాశాన్ని కల్పిస్తున్నది.

ప్రబోధ చంద్రోదయం, వరహపురాణం, శుకసప్తతి వంటి కావ్యాలను ఇంతవరకు అకాడమీ ప్రచురించింది. ఇప్పుడు భైరవకవి రచించిన శ్రీరంగమహత్త్వమును అందిస్తున్నది. భైరవకవి కృతమయిన కవిగజాంకుశమనే ఛందోగ్రంథాన్ని కూడా దీనితో జతపరచి ముద్రించింది. చాలాకాలం క్రింద మానవల్లి రామకృష్ణకవిగారు శ్రీరంగమహత్త్వమును వెలుగులోనికి తెచ్చిరి. ఇప్పుడీ కావ్యప్రతులు దొరకక పోవడంచేత అకాడమీ ప్రచురణకు పూనుకున్నది.

ఈ కావ్యానికి సంపాదకత్వం వహించి చక్కని పీఠిక నమర్చిన శ్రీ శ్రీరంగాచార్యులుగారికి అకాడమీ ధన్యవాదాలను సమర్పిస్తున్నది.

ఇరివెంటి కృష్ణమూర్తి

హైదరాబాద్కార్యదర్శి.