ఇట్టి శ్రీరంగక్షేత్రమున శ్రీవైష్ణవమతాచార్యులు తమప్రతిభాపాండిత్యములను-శక్తియుక్తులను ధారపోసి విశిష్టాద్వైతమతస్థాపన చేసి-ప్రచారము చేసినారు.[1]
శ్రీమన్నాథముని-యామునముని-శ్రీమద్రామానుజులు, పరాశరభట్టరు, దేశికులవారు, అందరూ ఈ కేంద్రమునుండియే తమ శ్రీసూక్తుల ప్రవచనము చేసిరి. దేశికులవారు ప్రధమపర్యాయము శ్రీరంగమునకు వేంచేసినప్పుడు- స్వామివారి అవయవ సౌందర్యమునకు ముగ్ధులై -'భగవద్ధ్యానసోపానము'ను రచించినారు. తమ ఆచార్యులవారి అనుశాసనమును కాదని- శ్రీరామానుజులవారు - ఈదేవళ శిఖరమునుండియే-అందరకును అష్టాక్షరీమంత్ర ముపదేశించి-ముముక్షువులుగా చేసి - ఆచార్యులవారి మంగళాశాసనములకు పాత్రమైరి. శ్రీవైష్ణవమతప్రచారము చేయుచు శ్రీమద్రామానుజులవారు ఈక్షేత్రముల సంచరించిరట.
| | శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం | |
రామానుజులవారికి పూర్వము మిక్కిలిగా ప్రచారమునందని శ్రీ వైష్ణవము-వీరి అవతారప్రాదుర్భావముతో మిక్కిలిగా వ్యాప్తి చెందినది. వర్ణసాంకర్యమును (వర్ణభేదమును) శ్రీవైష్ణవ మంగీకరింపదు. అందు కుదాహరణము- ఆళ్వారులే. వీరియందు పంచమజాతివారును గలరు-శంకరాచార్యులవారు - మనీషాపంచకమునందు-
'చండాలో౽స్తు సతు ద్విజో౽స్తు గురురి త్వేషామనీషా మమ' అని సెల విచ్చినదానిని మొదట శ్రీవైష్ణవులే అవలంబించినారు.
రామానుజులవారి యనంతరము - దేశికులవారి హయాములో - ప్రపత్తిమార్గమున వచ్చిన భేదభావములవలన శ్రీవైష్ణవము - రెండు
- ↑ 'వైష్ణవము'-విజ్ఞానసర్వస్వము. 3సం. తెలుగు సంస్కృతి. 560–565పుటలు.