పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శిశుపాలున కిచ్చుటకు నిశ్చయింపఁబడిన భీష్మకమహారాజు పుత్రికయగు రుక్మిణీదేవి తనప్రేమను శ్రీకృష్ణులవారి కెఱింగింపఁగా నాస్వామివారు కుండినపట్టణమున కేగి శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని రాక్షసవివాహమున, గొనిపోయి ద్వారకానగరమున యథావిధిగ వివాహ మాడిరి. అటు మీఁద మరికొందరిని వివాహ మాడి రని యున్నది. ఆ విషయ మిందుతో జతపరుపఁబడిన శ్రీకృష్ణోపన్యాసమునందు గొంత చెప్పఁబడి యున్నది. అమీఁద శ్రీస్వామివారు మురాసురుని నరకాసురుని వధించిరి. అందు నరకాసురునియొద్ద నున్న పదియారువేలమందికన్యలకు శ్రీకృష్ణులవారు భర్తయైనట్లు చెప్పఁబడి యున్నది. ఆవిషయ మిందుతో జతపరుపఁ బడియున్న శ్రీకృష్ణవిషయోపన్యాసమున బరిష్కరింపఁబడి యున్నది. శ్రీకృష్ణులవారు బాణాసురుఁడను వాని నొక యుద్ధమునందు జయించిరి. అపుడు బాణునికి సహాయముగా వచ్చిన శివునితో శ్రీస్వామివారు యుద్ధము చేసి యతనిని జయించి యతనివలన బాణుని గాపాడుటకయి స్తుతి చేయఁబడినట్లు చెప్పఁబడియున్నది. భారతగ్రంథకర్త యెట్లు కౌరవపక్షపాతియో అట్లు భాగవత గ్రంథకర్త విష్ణుపక్షపాతియైనట్లు కానవచ్చును. కాని , నిజముగ . శ్రీకృష్ణులవారియాధిక్యమునే చెప్పువాఁడు గాఁడు. ఈవిషయము ముందు విచారింతము . అంతియకాని