పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

వధకు దొరకక తప్పించుకొనిపోయెను. అచట వ్రేపల్లెయందు యశోదాదేవి ప్రక్కలో నున్నశిశువునుఁ దనబిడ్డగానే భావించి పెంచుచుండెను. ఆవ్రేపల్లెలో రోహిణీదేవికి బలరాముఁడు వీరికి ముందే జన్మించియుండెను. ఇట్లు వీరిరువురు బాలక్రీడలు సలుపుచు వ్రేపల్లెలో నుండుతరి గొన్ని దుర్నిమిత్తములు నాపదలు గలుగుచు వచ్చినందున నందాదు లాస్థలమును విడిచి కుటుంబపరివార సహితముగా బృందావనమునఁ బ్రవేశించిరి. అచ్చట రామకృష్ణులు గోవత్సములనుఁ దీసికొని గోపబాలురతోఁ గలిసి వెళ్లిమేపుచు వచ్చుచుండిరి. అట్టిసమయములలో శ్రీకృష్ణులవారు వత్సాసుర బకాసుర అఘాసుర శంఖచూడ వృషభాసుర కేశి వ్యోమాసురు లనురాక్షసులనుఁ జంపిరి. బలభద్రుఁడును ధేనుకాసురుని ప్రలంబాసురుని సంహరించెను. పూతనా కాళియమర్దన గోపీవస్త్రాపహరణ రాసక్రీడాది విషయము లీక్రిందఁ బొందుపరుపఁబడిన శ్రీకృష్ణవిషయోపన్యాసము నందు జర్చించి పరిష్కరింపఁబడి యున్నవి.

బ్రహ్మదేవుఁడు భూలోకమునకు వచ్చి శ్రీస్వామివారి మహిమను దెలిసికొనుటకు గోవత్సములను దాచిన ట్లొకకథ గలదు. త్రిమూర్తులలో నొకఁడైనట్టియు శ్రీమన్నారాయణుని వలన సృజింపఁబడి నట్టియు నీబ్రహ్మకు స్వామివారిమహిమను దెలిసికొనవలసినప్రసక్తి లేదు. కావున నీకథను గల్పితగాధగా