పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

12. శ్రీకృష్ణులవారు.

పరమేశ్వరుఁడగు నారాయణుఁడు భూలోకమున దుష్టుల శిక్షించి తద్ద్వారా సజ్జనులను రక్షించుకొరకు మధురానగరమునఁ దేవకీవసుదేవులకుఁ గుమారుఁడయి జన్మించెను. దేవకీదేవి మధురానగరపు రాజగు నుగ్రసేనుని తమ్మునికుమార్తె. ఆ యుగ్రసేనునికుమారుఁడగు కంసుఁడు మిగుల దుష్టప్రవర్తన గలవాఁడు. ఇతఁడు తండ్రిని బందీకృతునిగా జేసి రాజ్యమును స్వీకరించెను. తనపినతండ్రి కుమార్తెయగు దేవకిని నామె భర్తయగు వసుదేవునితోగూడ బందీకృతురాలినిగఁ జేసెను. అట్టిస్థితిలో శ్రీకృష్ణులవారు దేవకీదేవిగర్భమునఁ జన్మించిరి. సర్వశక్తిగల యాబాలుని యనుమతిప్రకారము తండ్రియగు వసుదేవుఁడాబిడ్డ నర్థరాత్రమునందు వ్రేపల్లెకుఁ దీసికొనిపోయి యందు నందునిభార్యయగు యశోదాదేవియొక్క ప్రక్కను రహస్యముగ నుంచి యామెప్రక్కలో నున్న యాడుబిడ్డ నెత్తుకొని వచ్చి తనభార్యప్రక్క నుంచెను. ఆమెకుఁ బుట్టిన మగశిశువులనందరినిఁ జంపుటకు నిశ్చయించుకొనియున్న కంసుడీపిల్ల రోదనమునుఁ దెలిసికొనివచ్చి యాడుబిడ్డయైనను జంపుటకుఁ బ్రయత్నించెను. ఆబిడ్డ శక్తియంశము గలది యగుటచే