పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

నను వీరు పూజనీయులు. వీరిలో నెవ్వఁడు సద్గుణము లెక్కుడుగ గలవాఁడో యట్టివానిఁ బూజింపు " మని చెప్పుచు.

సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతిఁజేసి
          యర్కుండు వెలిఁగించు నట్టులమృత
    సందోహనిష్యందచంద్రికఁ జేసిశీ
          తాంశుఁ డానందించునట్లు సకల
    జనులకుఁ దనదైన సదమల ద్యుతిఁజేసి
          తనరంగతేజంబు తనకుఁ దాన
    చేయుచునున్న సత్సేవ్యుండు వుండరీ
          కాక్షుండు కృష్ణుఁడనాదిని ధనుఁ
    డబ్జనాభుఁడుండ నర్ఘ్యంబునకు నిందు
          నర్హు లొరులు గలరె యజ్ఞపురుషు
    నఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు
          మధిప యదియ చూవె యజ్ఞఫలము."

ఇట్టు లనినపిదప సహదేవునిచే దీసికొనిరాఁబడినయర్ఘ్యమును ధర్మరాజు శ్రీస్వామివారికి సమర్పించెను. అపయిని శిశుపాలుఁ డనువాఁ డగ్రపూజకు శ్రీస్వామివా రర్హులు కారని విచ్చలవిడిగ నాక్షేపింపఁగా భీష్ముడు శిశుపాలునితో నిట్లనెను:-