పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49

యందకత్తె గావున నితఁడును నితనితమ్ముఁడగు సహదేవుఁడును మిగుల సౌందర్యముగలవారు. ఈనకులున కశ్వశిక్షయందును రక్షణవిద్యయందును గడునేర్పు గలదు. ఈవిద్యవలననే యజ్ఞాతవాసమున దననుఁ దాచికొనెను. ఈతఁడు యుద్ధము నందు గర్ణునికొడుకులగు, సత్యసేన చిత్రసేన సుశర్ము లనువారినిఁ జంపెను. ధర్మరాజు రాజసూయయాగముఁ జేయునపుడు పశ్చిమదిక్కున కేగి యాదేశపురాజులనుఁ జయించెను. చివరకు ధర్మరాజుతోగూడ నడవికిఁ జని క్రమముగ గాలము గడపుచుఁ బరలోకము నొందెను.

8. సహదేవుఁడు.

ఇతఁడు పాండుమహారాజు కనిష్ఠపుత్రుఁడు, నకులునివలె సౌందర్యముగలవాఁడు. నీతిమంతుఁడు. ధర్మాధర్మముల నెఱిఁగినవాడు. గోరక్షణవిద్యయందు నేర్పరి. అవిద్యవలననే యజ్ఞాతవాసమున గాలమును గడపెను. రాజసూయయాగమునకుముందు దక్షిణదిక్కున కరిగి యాదేశపురాజులను గెలిచి ధనముం గొని తెచ్చెను.

రాజసూయానంతరమున నగ్రపూజ కెవ్వఁ డర్హుఁడో యని చూచుతరి భీష్ముడు "స్నాతకుఁడును, ఋత్విజుఁడును, సద్గురుఁడును, ఇష్టుఁడును, భూతలేశుఁడును, సంయతుండును