పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

తనమీఁద నెదిరించి యుద్ధము చేయని భీష్మునితో నతనికి బరమశత్రువగు శిఖండిప్రక్కనుండి యుద్ధము చేసి కురు సేనాధిపతియగు నాభీష్ముని నేలం గూల్చెను. సైంధవవధనాఁడు కురుసేన నొంటరిగ జొచ్చి చాలసేనను జంపి చివరకు సైంధవుని తలఁ దునిమి ప్రతిజ్ఞను దీర్చికొనెను. పదునేఁడవదినమున నప్పటికురుసేనాధిపతియగు గర్ణునితోఁ ద్వంద్వయుద్ధము చేసియుభయ సేనలవారును మెచ్చుకొనునటు లతనిఁ జంపి శిబిరమునం దున్న ధర్మరాజుకడ కేగి యతనిని సంతుష్టాంతరంగుని జేసెను.

యుద్ధానంతరమున నశ్వత్థామ నోడించుటయు నతని శిరోమణినిఁ దెచ్చి ద్రౌపది కిచ్చుటయు నిదివరకే వ్రాయఁబడి యున్నది

అనంతరము ధర్మరాజుచేఁ జరుపఁబడిన యశ్వమేధయాగమునకుగా నశ్వమువెంటఁ దిరిగి నలుదిక్కులు జయించివచ్చెను.

ఈ యర్జునుఁడు తనపౌత్రుఁడగు పరీక్షిత్తుయొక్క పట్టాభిషేకానంతరము తనయన్నతోఁ గలిసి యడవి కేగి యచట గాలముఁ గడపుచుఁ బరలోకప్రాప్తి నొందెను.

7. నకులుఁడు.

ఇతఁడు పాండుమహారాజు నాలుగవకుమారుఁడు. అతని రెండవభార్యయగు మాద్రీదేవికిం దొలిపట్టి. ఆదేవి చాల