పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

పెను. "ఈ కురువృద్ధు డస్త్రవిద్యయందును లోకానుభవమందును, ధర్మాధర్మనేత్తృత్త్వమందును, దత్త్వజ్ఞానమందును బ్రసిద్ధి జెందిన మహానుభావుఁడు. ఇట్టివాడును మహారాజావారు చెప్పిన రీతిని గొన్ని సమయములందు దుర్యోధన ముఖోల్లాసమునకై స్వానురూపమగు మార్గమున నడువని వా డాయెను. కపటద్యూత కాలమునను, ద్రౌపదీ వాస్త్రాపహరణ సమయమునను గౌరవులను వారింపక భీష్ముఁడూరకుండుట సరికాదని వారు చెప్పిన దాని నందరు నొప్పుకొనవలసియున్న ది.

అస్త్ర విద్యాచార్యుఁడని కురుపాండవులచేతనే కాక యితర క్షత్రియ వంశజులచేత గూడ గౌరవింపఁబడిన ద్రోణాచార్యుఁ డభిమన్యుని విషయమై ధర్మ విరుద్ధమగురీతిని నడచెనని మహారాజా వారు చెప్పినదానికి విరుద్ధముగ నెవరు చెప్పగలరు ?

యుధిష్టిరుఁ డీభూమండలంబున జన్మించిన మహాపురుషులలో నొకఁడని చెప్పవచ్చును. భూతదయ యందును, ధర్మాధర్మవిచారంబు నందును, సత్యపరాయణత్వమందును, పరార్థము స్వసుఖము నపేక్షింపక యుండుటయందును నీతనితో సమానులగు పృధ్వీపతులు మృగ్యులు, ఇట్టి మహాపురుషుఁ డొక సమయమున నబద్ధమాడినట్లు భారతములో జెప్పఁబడియున్న ది. ఈ యన యనృతమాడి యుండడని మహారాజావారి యభిప్రాయము. ఇట్టి యభిప్రాయము మహాగుణశాలియగు యుధి