పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

యిటుల తనరూపమును బయలుపరచుట జూడఁగా నీయర్జనుఁ డజ్ఞాతవాసకాలపూర్తినిఁ దెలిసికొనియె యిట్లు చేసినట్లు స్పష్ట పడును,

సేనోద్యోగసమయమున నీయర్జునుఁడును దుర్యోధనుఁడును నించుమించుగ నేకకాలమున ద్వారకకు బోయి శ్రీకృషులవారిసాయము నిరుపక్షముల వారును గోరిరి. అపుడు శ్రీస్వామివారు నారాయణ గోపాలురను పదివేల రథికులను యుద్ధసాహాయ్యముకొరకొకవంతుగను, యుద్ధము చేయక యొకపక్షమున మేలు గోరుచు దా నుండుట యొకవంతుగను నేర్పరచి వంతులను గోరుకొనుటలో జిన్నవాఁడు ముందుగ గోరుకొనుట యాచారము గాన నర్జునుని ముందుగ గోరుకొను మని సెల విచ్చిరి. ఈయర్జునుఁడు శ్రీస్వామివారినే కోరుకొనెను. యుద్ధముచేయని యీస్వామికంటె బదివేవురు రథికులు దనకు దొరికి రని మెచ్చుకొని దుర్యోధనుఁడు సంతసించి వెడలెను. అప్పుడు శ్రీస్వామివారు యుద్ధముచేయని నన్నేల నీవు కోరికొంటి వని యర్జును నడుగఁగా నతఁ డీక్రింది విధమున మనవిచేసికొనెను:--

క. "అనుటయు నాతఁడు హరి కి
    ట్లను నేను రణంబునకు సహాయత యొల్లన్