పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

దుర్యోధనునకు బ్రాణములు విడుచునంతవరకు నుపచారములు చేయుటకు భృత్యుల నియమింపక యీధర్మరాజు పోవుట మంచిపని కాదు. అటుల చేయుటచేతనేకదా దుర్యోధనుని యొద్ద కశ్వత్థామాదులు వచ్చుటకు వీలు కలుగుటయు, తమ రాజుయొక్కదురవస్థనుఁ జూచి వార లతికోపోద్దీపితమానసు లగుటయు, నం దశ్వత్థామ పాండవులశిబిరమునఁ జొచ్చి నిద్రించుచున్న వీరుల ననేకులను జంపుటయుఁ గలిగెను.

యుద్ధానంతరమున ధర్మరాజు పట్టాభిషిక్తుఁ డయి యశ్వమేధాదిక్రతువులను జరిగించెను. వృద్ధులగు గాంధారీధృతరాష్ట్రుల నతిగౌరవానురాగములతో నాదరించెను. అభిమన్యునిపుత్రుఁడగు పరీక్షిత్తు పెద్దవాఁ డయినపిదప నాతనిని రాజ్యమున కభిషిక్తునిగఁ జేసి ధర్మరాజు గతించినసూర్యచంద్ర వంశపురాజులమార్గము ననుసరించి తమ్ములతోను, ద్రౌపదితోను, నుత్తరాభిముఖుఁడయి యరిగెను. అచట వారలు లోకాంతరగతు లగువరకును గాలమును గడపిరి. అయితే ఒకవిధముగ వారలు లోకాంతరగతు లయి రని భారతము నందుఁ జెప్పఁబడి యున్నది. కాని వా రడవి కేగినపిదప నే విధముగ లోకాంతరగతు లైరో యెవరికి దెలియఁగలదు ?

ఈయుధిష్ఠిరుఁడు ధర్మమునం దధికదృష్టి నుంచుటను బట్టియే ధర్మరాజని పిలువఁబడెను. ధర్మయుక్తముగ బాలింపనివాఁడు