పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

రాయభార మంపునవుడు గొంత సుళువుగ నడుగుటయుఁ గలదు. అయితే ధర్మరా జైదుపల్లెలైన జివరకు నిమ్మని చెప్పి పంపినందుకు నాదుర్యోధనుఁ డీతని నిండుదీనత నెఱిఁగి సూదిమొన మోపినంతస్థలమైన నీయ నని నిరాకరించెను.

ఈధర్మరాజు యుద్ధమధ్యమున భీష్మునియొద్దకు బ్రచ్ఛన్నముగఁ బోయెను. ద్రోణాచార్యునివధకొఱకు ననృత మాడెననువిషయము లుపోద్ఘాతమున జర్చించి పరిష్కరింపబడి యున్నవి.

పదునెనిమిదవనాటి యుద్ధమునఁ గౌరవసేనాధిపతియగు శల్యుని నీధర్మరాజు హతునిగఁ జేసెను.

దుర్యోధనుఁడు డాగియున్న చోటి కరిగి యతనిని ద్వంద్వ యుద్ధమునకుఁ బిలిచినపుడు తమయైదుగురిలో నొకని నెంచుకొను మనియు, నతని దుర్యోధనుఁడు జయించినచో రాజ్యమును విడుచుకొనియెద ననియు, నొకపందెము వైచెను. పాండవులయదృష్టముకొలఁది నాదుర్యోధనుఁడు భీము నెంచి కొనుటయు నతనిచేఁ గూల్పఁబడుటయు జరిగెను. అట్లు పందెము వైచినందుకు శ్రీకృష్ణులవారు తిరుగ జూదమునే తెచ్చి పెట్టితివా యనియు, నిన్ను గాని నీపిన్నతమ్ము లిద్దరిలో నొకనినిగాని కోరినయెడల మీ రేమిచేయగల రనియు, దూలనాడిరి. భీమగదాహతుఁడై క్రిందఁబడియున్న యా