పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

దమదూతగా ధర్మరాజునొద్దకుఁ బంపిరి. అపుడు పాండవులు తమకు నొప్పుదలప్రకార మర్థరాజ్యము నీయనిచో రాజధర్మమగుయుద్ధమున రాజ్యము నొందుదు మని తీక్ష్ణముగాఁ బ్రత్యుత్తర మిచ్చి సంజయునిఁ బంపిరి. తిరుగ ధర్మరాజు తాను శ్రీకృష్ణులవారిని గౌరవులకడకు సంధికొఱ కనుపునపుడు చివరకు దమయైదుగురికి నైదుపల్లె లిచ్చిననుఁ జాలు నని చెప్పిపంపెను. అట్లు కురురా జైదుపల్లె లిచ్చినచో వీరిపని యేమి యగును? ఇట్టిమహావీరు లైదుపల్లెలే కాదు. కొన్ని గ్రామములు గల యొకచిన్న రాజ్యమును సంపాదించుకొనఁజాలరా? లేదా బంధువులగు ద్రుపదవిరాటులయొద్ద నీపాటి భూస్థితిని బొందలేరా! ఇది యెట్లున్న దనిన - 'రావణుఁడు వచ్చి శరణుజొచ్చినయెడల దనయయోధ్యారాజ్యము నతనికి నిచ్చెద' నని శ్రీరాములవారు విభీషణ శరణాగతిసమయమున సెలవిచ్చిన ట్లున్నది. అయితే శ్రీరాములవారు సర్వజ్ఞులు, ధర్మరాజట్టివాఁడు గాఁడు. . కావున నితఁ డట్లు చేయుట తగినపని కాదు. ఈధర్మరాజు కోరిక లె ట్లుండినను సంజయుఁడు తన యొద్దకు వచ్చినప్పుడు పట్టుదలతో నర్థరాజ్యము నడుగుటకును శ్రీకృష్ణులవారినిఁ బంపునపుడు ముందువలె గాక యెంతైనను దగ్గించి యడుగుటకును గారణ మే మని విచారింతము. ఎదుటివాఁడు సంధిని గోరినపుడు బింకముగ బలుకుటయు దాను