పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

బడెననువిషయ మిదివరకే వ్రాయఁబడి యున్నది. బంధుమిత్రుల కితరులవలన నాపదలు సంభవించినపుడు వారలను గాపాడుట నిస్సందేహముగా ధర్మమే. అయితే ఈదుర్యోధనుఁడు బాల్యమునుండియు బాండవులకుఁ గీడు గోరుచు లక్క యిండ్లలోఁ బెట్టి చంపఁబూనెను. మొదటిసారి కపట ద్యూతమున సర్ధరాజ్యమును, భార్యాసహితముగ బాండవులను, గెలుచుకొనెను. రెండవసారి మొదటివిధమున గెలిచికొనినయెడల ముసలివాఁడగు తనతండ్రిచే నర్థరాజ్యము తిరుగ నిప్పింపఁ బడుచునేయుండు నని తలఁచి యరణ్యాజ్ఞాతవాసముల నోడినవారు చేయుటకు నిర్ణయించి కపటద్యూతమునఁ బాండవులను గెలిచెను. ఇటుల చేసినచో నజ్ఞాతవాసమున దప్పక బయలు పడుదు రనియు నరణ్యవాసమునందు శ్రమచే శుష్కించి బలహీనులు కాగల రనియు నీపదుమూడు సంవత్సరములు బంధుమిత్రుల కెడ మగుదు రనియు దలఁచి గెలిచెను. కావున దుష్టబుద్ధితో నిట్లు విరోధి యై యున్న యీదుర్యోధనుని విడిపింపు మని సోదరులను బంపుట యనుచితము. అటుల నీధర్మరాజు చేయుటయే యీభారతయుద్ధమునం దనేకులు మడియుటకుఁ గారణ మైనది.

పాండవులు సంధికొఱుకు ద్రుపదపురోహితునిఁ బంపఁగా దుర్యోధనాదులు సదుత్తరము చెప్పిపంపక వెంటనే సంజయుని