పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

బడెను. ద్రోణాచార్యుఁ డలిసి యుద్ధముచేయలేక ప్రాయోపవేశమునఁ బ్రాణములు విడుచుటకు గూర్చునియుండఁగా నితని కట్టిపని యెందు కనియు, తనతండ్రితలంపు నెరవేర్చుట తనపని యనియు దలఁచి యాద్రోణునితలను నఱికెను.

3. విరటరాజు.

ఇతఁడు మత్స్యదేశపురాజు. మిగుల సత్యకాలపు బెద్ద మనుష్యుఁ డని చెప్పవచ్చును. ఏల యనిన, అజ్ఞాతవాసకాలమున జీవనముకొఱకు బ్రచ్ఛన్న వేషు లై యేకదినమున దన యెదుటికి వరుసగ వచ్చిన పంచపాండవులకును ద్రౌపదికిని వీరు పాండవులా యని లేశమాత్రమును సంశయింపక యాకారములనుబట్టి విచారింపక వేషధారులవేషములను నమ్మి జీవనోపాధులను గల్పించెను. ఇతనికడ ధర్మరాజు యతివేషధారిగను, భీముఁడు వంటయింటియజమానుఁడుగను, నర్జునుఁడు రాజకన్యలకు నృత్యవిద్య నేర్పువాఁడుగను, నకులుఁ డశ్వరక్షకుఁడుగను, సహదేవుఁడు గోరక్షకుఁడుగను, ద్రౌపది విరటునిభార్యయొద్ద సైరంద్రి (అనఁగా నలంకారములు చేయునది) గాను నుండి యజ్ఞాతవాసమును గడపిరి మరియు దక్షిణోత్తరగోగ్రహణానంతర దివసమున బాండవులు ద్రౌపదీసహితముగ మారువేషములను దీసివేసికొని నుస్నాతు లయి విరటుని కంటె ముందుగ సభామంటపమున కేగిరి, ధర్మరాజు తన