పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణ.

ఈభాగములోఁ బాండవపక్ష వీరులవిషయము చర్చింపఁబడును.

1.ద్రుపదరాజు.

ఇతఁడు పాంచాలదేశాధిపతి. ద్రౌపదీదేవికి దండ్రి. బాల్యమునందు ద్రోణునితోఁ గలిసి యస్త్రవిద్యను నేర్చికొనునపుడు తనకు రాజ్యాధిపత్యము వచ్చినతరి దనతోఁ గలిసి సమస్తభోగముల ననుభవింప వచ్చునని యతనికిఁ జెప్పియుండెను. ఈద్రుపదుఁడు రా జయినపిదప ద్రోణుఁ డతనియెద్ద కేగి నీబాల్యసఖుఁడ నని చెప్పుకొనఁగా నీవంటిబీదబ్రాహణునికిని నాకును సఖ్య మెట్లు పొసఁగు నని నిరాకరించెను. ఆ ద్వేషమును ద్రోణుఁడు మనస్సునం దుంచుకొని రాజకుమారు లస్త్రవిద్య నభ్యసించినపిదప నాద్రుపదునిఁ బ్రాణముతోఁ బట్టి తెచ్చి తనముందు పెట్టుటయే గురుదక్షిణగ భావించెద నని వారలను గోరెను. ముందు కురుకుమారు లటుల చేయుటకుఁ బ్రయత్నించి ద్రుపదునిచేఁ బరాజితు లయిరి. అప్పు డర్జునుఁడు భీమనకులసహదేవసహితుఁడై వెడలి ద్రుపదుని