పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

పాండవు లరణ్యాజ్ఞాతవాసప్రతిజ్ఞలనుఁ దీర్చికొని యుపప్లావ్యమున విడిది చేసికొని తమరాజ్యభాగమును దమకిప్పింపు మని కౌరవులయొద్దకు దూత నంపిరి. అందుకు దుర్యోధనుఁడు నిరాకరించెను. తుదకు శ్రీకృష్ణులవారే రాయభారమున కేగిరి. దూతగా వచ్చిన యాతనినిఁ దుర్యోధనాదులు పట్టి కట్టుటకు సమకట్టిరి, సర్వవ్యాపియగు నాభగవంతుఁ డిట్టిదుష్టులచే గట్టఁ బడునా ? ఏమివింత ! సేనానాయకులగు భీష్మద్రోణకర్ణశల్యు లొక్కొకరు వరుసగా మడియుటను జూచుచు దుర్యోధనుఁడు రాజ్యకాంక్షనుబట్టి తనమంచిని విచారింపక చివరకు దాను పడువరకు యుద్ధముచేసి పదునొకం డక్షౌహిణులవారిని హతులగువారినిగాఁ జేసెను. అందరు మడిసిన పైని పారిపోయి యొకమడుగులోఁజొచ్చి యుండెను. పాండవు లాసంగతిఁ దెలిసికొని యచటికిఁ బోయిరి. అపుడు ధర్మరాజు తమయైదుగురిలో నెవ్వనినైన నెంచికొని ద్వంద్వయుద్ధము చేసి గెలుపుగొను మని చెప్పఁగా భీముని నెంచికొని యాతనితో గదాయుద్ధము చేసి యతనిచే దొడలు విరుగఁగొట్టబడి నేలఁ గూలెను.

పాండవు లైదుగురిలో భీమునినే ద్వంద్వయుద్ధమున కేల యెంచె ననఁగా తనను రణములో జయించి తనతలనుఁ దన్నుటకు శపథముఁ జేసిన యీభీముఁడు బ్రదికియుండినచో నెప్పటికైనను నాశపథమును నెరవేర్చు ననియు, తక్కిననలుగురు