పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

ధనుని స్త్రీసహితముగ విడిపింపఁజేసెను. పాప మీదురాత్ముఁ డాకృతజ్ఞత యేమియు లేనివాఁ డయియే పిదప సంచరించెను.

పాండవు లజ్ఞాతవాసములో నుండుకాలము పూర్తి యగుటకు ముందు వారిని భగ్నప్రతిజ్ఞలుగ జేయుటకుఁ గోరి భీష్నినిచేఁ జెప్పఁబడిన గురుతులవలన విరటరాజుపురమున బాండవు లుండియుండవచ్చునని యూహించి యచటి కేగి దుర్యోధనుఁడు తనసేనను రెండుభాగములుగ విభజించి ముందునాఁ డం దొక భాగమును విరటునిపురమునకు దక్షిణభాగమునం దున్నగోవులను బట్టుటకు నియోగించెను. తన్నివారణముకొరకు విరటరాజు సేనలతో వెళ్లెను. అతనివెంట నర్జునుఁడు తప్ప దక్కిన నలువురు పాండవులును వెళ్లిరి. అట్టిసమయమును జూచి మరునాఁ డుత్తరభాగమున నున్న గోశాలలోనిపశువులను దస్కరించుట కీదుర్యోధనుఁడు భీష్మకర్ణాదివీరులతో వెడలి ముట్ట డించెను. అపుడు విరటునికుమారుఁ డగు నుత్తరునితోఁ గలిసి యర్జునుఁడు పోయి సేనపయిఁ దాఁకి గోవులను మరిలించుకొని పచ్చెను. అప్పు డాతనియుద్ధాటోపమునుఁ జూచి యర్జునునిగాఁ దెలిసికొని యజ్ఞాతవాసకాలము మించినదిగా దలఁచి లెక్క పెట్టి చూచుకొని యెరిగి చిన్నబోయి దుర్యోధనుఁడు హస్తినాపురమునకుఁ బోయెను. ఆ దక్షిణగోగ్రహణమునిమిత్తము వెడలిన సేనాభాగము విరటరాజు మొదలగువారిచే నోడింపఁబడెను.