పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ధర్మరా జోడి యరణ్యాజ్ఞాతవాసములు చేయుటకు ద్రౌపదితోను సోదరులతోను గలిసిపోయెను.

తిరుగ బాండవులు ప్రతినఁ దీర్చికొని వత్తు రేమో యను భయముచేత నితఁ డనేకమాయావిద్యలను నేర్చుటయే కాక యుద్ధనైపుణ్యము నభివృద్ధిపరచుచునే వచ్చెను.

పాండవు లరణ్యవాసమునం దుండుతఱి దుర్యోధనుఁడు తనవిభవమును వారలకు గనఁబరచుటకుగాను ఘోషయాత్ర యను నెపమున సేనాబలయుక్తుఁ డయి వెళ్లి పాండవు లుండు ద్వైతవనంబునఁ గంధర్వులను నొక తెగవారి యాజమాన్యము క్రింద నున్న యొకసరస్సు నొడ్డున సేనలతోఁ బస చేసెను. తమయనుమతిలేక యటుల విడిసియున్న దుర్యోధనాదులతోఁ గంధర్వులు యుద్ధముచేసి యందరువీరులనోడించి దుర్యోధనుని భార్యాప్రభృతిస్త్రీలతో బంధించి తమ నగరమునకుఁ దీసికొని పోవుచుండిరి. అంత నీదుర్యోధనునిపరిచారకులలోఁ గొందరు దిక్కు తోఁచక సమీపమున నుండు ధర్మరాజుకడ కేగి తమ ప్రభువునకు సంభవించినయాపదనుఁ జెప్పుకొనిరి. 'మన మిట్టి దురవస్థలో నుండునపుడు మనకు దనవిభవమునుఁ జూపుటకు వచ్చిన వానికి గాగలపని గంధర్వులే చేసిరి. మన మేల యతనికి సహాయులమై విడిపింపపలె' నని భీమునిచే నివారింపఁబడినను యుధిష్ఠిరుఁ డతిధర్మరాజు గావున వినక తమ్ముల నంపి యాదుర్యో