పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

ఈవిదురుఁ డెవరి కేయేతరుణములలో హితవు చెప్పవలసి వచ్చునో యప్పు డంతయు భీష్మద్రోణకృపాదులవలె గాక నిష్కాపట్యముతోఁ జెప్పియున్నాఁడు. కౌరవులయొద్ద జీవనోపాధి కలిగినప్పటికి, పాండవులను వారణావతమున లక్క యిండ్లలో బెట్టి చంపుటకు గాను జేసిన దుర్యోధనుని దుష్ప్రయత్నమునుఁ దెలిసికొని, పాండవుల కెఱింగించి, వారి నట్టి యాపదనుండి కాపాడియున్నాఁడు.

శ్రీకృష్ణులవారు రాయభారమునకు వెళ్లినపుడు ధృతరాష్ట్రునిభవనమందే కాక భీష్మాదుల గృహములయందు సహా భోజనము చేయుట మాని తమకు బ్రియుఁడైన యీవిదురునియింట భోజనము చేసిరి. ఈసందర్భములో శ్రీకృష్ణులవారు సభయందు దుర్యోధనునితో నిట్లు సెల విచ్చిరి :-

క. "పగవారియింటఁ గుడిచిన
    నగుఁ దమ కనుమాన మమృత మైనను దారుం
    బగతురకుఁ గుడువఁ బెట్టఁగఁ
    దగ దొడళుల కెప్పు డెవ్విధము వాటిలునో!"

నేను పగతుండనే యంటేని,

క. “అలుగుదు పాండవులకు వా
    రలు నాకుం బ్రాణములు ధరావల్లభ యి