పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

రాజ్యము నీతనియాజ్ఞకు లోఁబడి పాలించెను. అంధుఁ డగువాఁడు రాజ్యాధికారమున కసర్హుఁడై యుండినను, పాండురాజు తానే రాజ్యమునుఁ దీసికొనక యన్నయందు గల భక్తికొలఁది ప్రభుత్వమును విడిచియుంచినప్పటికి, నట్టి సోదరునికుమారులును, ధార్మికులును, నగు పాండవులకు ముం దొప్పి యిచ్చిన యర్థరాజ్యమును దనజ్యేష్ఠపుత్రుఁడగు దుర్యోధనుఁడు కపటద్యూతముచే హరించుచున్న పుడు, దాని నితఁ డుపేక్షించుటయే యీమహాభారతయుద్ధమునకు గారణమైనది. ఇందుకు నిదర్శనము :-

1. శ్రీకృష్ణులవారు రాయభారమునకు వెళ్లి మరలి వచ్చుతరుణములో ధృతరాష్ట్రుఁడు • నాయం దేవిధమైన తప్పును లే ద'ని వారితోఁ జెప్పఁగా నచట నున్న బాహ్లికభీష్మద్రోణకృపాచార్యులవైపు చూచి యీక్రిందివిధమున నెత్తి పొడిచి సెల విచ్చిరి-

తే. గీ. "ఇప్పు డీసభఁ బుట్టిన యింతవట్టు
        మీకు దెల్లంబ కాదె! యీమేదినీవి
        భుండు దా నేమిటికిని ముఖ్యండగాను
        తప్పు తనదెస లే దని చెప్పి విడిచె."

2. పాండవులు వనవాసమున నుండుతరి నొకబ్రాహ్మణుఁడు వారిశ్రమనుఁ జూచి వచ్చి తనతోఁ జెప్పినపు డీ.