పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక.

మన దేశములోనున్న మహారాజులలో బ్రజాపరిపాలన మందును లోకానుభవమందును రాజనీతియందును బండిత రంజనమందును విఖ్యాతులును బొబ్బిలి సంస్థానాధిపతులు నయిన శ్రీవేంకట శ్వేతాచలపతిరంగారాయ మహారాజావారు తాము రచించిన శ్రీమన్మహాభరత రామాయణ విమర్శనమను గ్రంథమునకు భూమికను వ్రాయుమని నాతో సెలవిచ్చిరి. సకల హిందూధర్మ ఖనులనఁదగిన యీ గ్రంథములలోనున్న యపూర్వార్థములను జూపిన శ్రీమహారాజావారికృతికిఁ బ్రస్తాననను వ్రాయుటకుఁదగిన సామర్థ్యము నాకుఁ గలదా యను విషయము సంశయాస్పద మగుటచే నొకించుక జంకియును తద్దయాసూచకమగు నియోగము నతిక్రమింపలేకుండటనుబట్టి యీ యవతారికను వ్రాయబూనితిని.

చిరకాలమునుండి ధర్మార్థ కామమోక్షములతో సంబంధించిన సర్వ విషయములందును మహాభారత రామాయణములు హిందువులచే బ్రమాణగ్రంథములుగ నంగీకరింపఁబడి యున్నవి. వీనిలో నుదహరింపఁబడిన సంగతు లీగ్రంథకర్తల