పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

మును వారి కిచ్చివేయు మనియు, బలుమారు లొత్తి చెప్పెను. ఇట్లు చెప్పుట చిత్తశుద్ధిచేఁ గాదు. ఇష్ట ముండినను లేకపోయినను సంధికార్యములయందు సభలలోఁ దగువారు సంధి కనుకూల మగునటులఁ జెప్పక తీరదు.

యుద్ధారంభమునకు ముం దనుజ్ఞ గొనుటకయి భీష్మద్రోణకృపులయొద్దకు ధర్మరాజు వచ్చినపుడు, తాము కౌరవులకు ధనముచే గట్టుపడియుంటి మనియు, అందుచే వారి పక్షమున యుద్ధముచేయక తప్ప దనియు, పాండవులకే మేలు కోరుచుందు మనియు, నీ మువ్వురు నేకరీతినిఁ జెప్పినటుల మహాభారతమున నున్నది. వీరిమాటలను బట్టి విచారింపఁగా, అధర్మపరు లగుకౌరవులకు సాయము సేయుట మధ్యస్థులును, వృద్ధులును, నగు తమకు ధర్మము కాదని లోకులు నిందింతురని తలఁచి తమమనశ్శాంతికొరకును, పయి మెప్పుకొరకును, వీరు ముందే యోచించుకొని బడిపిల్లలు పాఠము నొప్పగించినట్టు లేకరీతిని ని ట్లాడినట్లు తోఁచుచున్నది. కానిచో శూరులుసు, వృద్ధులును, నగు తాము రెండుపక్షములయెడ సమబుద్ధిఁ గలిగి యుండుట నిజమే యయినపక్షమున విదురబలరాములతోఁ బాటు యుద్ధమునుఁ జేయుట మానిన నెంత శ్లాఘ్యముగ నుండును? తమ్ముఁ గౌరవు లేమి చేయఁగలరు? వారు తమ్ముఁ బోషింపఁ రని యింతమాత్రమునకు భయపడవలెనా ! బాగుగ